×
Ad

Bhagwant Mann : సీఎంగా భగవంత్ మాన్ దాస్ ప్రమాణ స్వీకారం.. డేట్ ఫిక్స్

పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి టైం ఫిక్స్ అయ్యింది...

  • Published On : March 11, 2022 / 05:07 PM IST

Punjab Aap

Punjab Chief Minister : పంజాబ్ రాష్ట్రంలో ఆప్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతోంది. సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారానికి టైం ఫిక్స్ అయ్యింది. 2022, మార్చి 16వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అంతకంటే ముందు ఈనెల 13వ తేదీన అమృత్ సర్ లో ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ రోడ్ షో నిర్వహించనున్నారు. ఈ రోడ్ షోలో భగవంత్ మాన్ కూడా పాల్గొననున్నారు.

Read More : Bhagwant Mann : ఆప్ అధినేత కేజ్రీవాల్ తో భగవంత్ మాన్ భేటీ.. పంజాబ్ లో ప్రభుత్వ ఏర్పాటుపై చర్చ

ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భాగంగా… పంజాబ్ రాష్ట్రంలో కూడా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో ఆఫ్ విజయదుందుభి మ్రోగించింది. 117 అసెంబ్లీ స్థానాలున్న ఈ రాష్ట్రంలో ఆప్ ఏకంగా 92 సీట్లలో విజయం సాధించింది. చీపురు దెబ్బకు కాంగ్రెస్, బీజేపీతో సహా ఇతర పార్టీలు కొట్టుకపోయాయి. ఈ క్రమంలో పంజాబ్ రాష్ట్ర సీఎంగా ఉన్న చరణ్ జీత్ సింగ్ చన్నీ తన రాజీనామా పత్రాన్ని గవర్నర్ కు సమర్పించారు.

Read More : Navjot Singh Sidhu : పంజాబ్‌లో ఆప్ ప్రభంజనం.. ప్రజా తీర్పును శిరసావహిస్తా : నవజ్యోత్ సింగ్

పంజాబ్ రాష్ట్రంలో ఎన్నికలు జరుగుతున్న క్రమంలో ఆప్ పార్టీ పటిష్టమైన వ్యూహాలు రచించింది. ముందుగానే సీఎం అభ్యర్థిని ప్రకటించింది. ప్రజాభిప్రాయ సేకరణ జరిపి సీఎం అభ్యర్థిగా భగవంత్ మాన్ పేరును ప్రకటించింది. ఈయన ధురీ నుంచి పోటీ చేసి 58 వేల 206 ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. అనంతరం ఆయన సంచలన ప్రకటన చేశారు. తాను రాజ్ భవన్ లో కాకుండా…భగత్ సింగ్ గ్రామమైన ఖట్కర్ కలన్ లో సీఎంగా ప్రమాణం చేస్తానని ప్రకటించి అందరి దృష్టిని మరోసారి ఆకర్షించారు. అంతేగాకుండా కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫొటోలు ఉండవని, షహీద్ భగత్ సింగ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఫొటోలు ఉంటాయని వెల్లడించారు.