Bihar woman: కలలో రేప్ చేస్తున్నాడంటూ మాంత్రికుడిపై కేసు నమోదు
బీహార్ లోని ఓ మహిళ తాను ఓ మాంత్రికుడి చేతిలో పలు మార్లు అత్యాచారానికి గురవుతున్నానంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈ ఏడాది జనవరిలో తన కొడుక్కి ఆరోగ్యం బాగాలేదని...
- Subhan Ali Shaik
- Published On : June 25, 2021 / 01:54 PM IST
Bihar Woman
Bihar woman: బీహార్ లోని ఓ మహిళ తాను ఓ మాంత్రికుడి చేతిలో పలు మార్లు అత్యాచారానికి గురవుతున్నానంటూ స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. ఈ ఏడాది జనవరిలో తన కొడుక్కి ఆరోగ్యం బాగాలేదని నయం చేయాలంటూ మాంత్రికుడ్ని కలిసింది. కొన్ని సూచనలు చేసి పంపించాడు. 15రోజుల్లోనే కొడుకు గుర్తు పట్టలేని అనారోగ్యంతో చనిపోయాడు.
గుడి దగ్గరకు వెళ్లిన మహిళ మరోసారి మాంత్రికుడ్ని కలిసింది. తన కొడుకు చావుకు కారణమేంటో తెలుసుకోవాలనుకుంటున్నట్లు చెప్పింది. అప్పటి నుంచి ప్రతి రోజూ రాత్రి కలలో మాంత్రికుడు తనని రేప్ చేస్తున్నట్లుగా కలలు వస్తున్నాయని బాధితురాలు పేర్కొంది. ఆ కలలో చనిపోయిన తన కొడుకు బతికొచ్చి తనను రక్షిస్తున్నాడని ఫిర్యాదులో రాసిచ్చింది.
కంప్లైంట్ నమోదు చేసుకున్న పోలీసులు మాంత్రికుడ్ని పిలిచి విచారించి సాక్ష్యం లేకపోవడంతో వదిలేశారు.
ఆ మహిళ మానసికంగా సరిగా లేకపోయుండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఆమె మానసిక ఆరోగ్యం గురించి బంధువులను, తెలిసిన వారిని ఎంక్వైరీ చేస్తున్నారని డీఎస్పీ లలిత్ నారాయణ్ అంటున్నారు.
