Annamalai : అన్నామలై రాజీనామాను ఆమోదించిన బీజేపీ అధిష్టానం.. కొత్త పార్టీ పేరు అదేనా?

Annamalai : తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవల పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించారు.

Annamalai

Annamalai : తమిళనాడు బీజేపీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఇటీవల పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అయితే, ఆయన రాజీనామాను బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్ ఆమోదించారు. అయితే, అన్నామలై కొత్త పార్టీ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచారం జరుగుతుంది.

Also Read : Karnataka Politics : కర్ణాటక కాంగ్రెస్‌లో మళ్లీ టెన్షన్.. మొన్న మంత్రిగా ప్రమాణ స్వీకారం.. నేడు రాజీనామా.. డీకే సర్కారుకు ఆదిలోనే కుదుపు

త్వరలో అన్నామలై కొత్త పార్టీని ఏర్పాటు చేయబోతున్నారని, ఆ పార్టీకి తమిళగ మక్కల్ కళగం లేదంటే తమిళగ మక్కల్ కట్చి అనే పేర్లలో ఏ ఒకటి పెట్టబోతున్నారని ప్రచారం జరుగుతుంది. తమిళ రాజకీయ వర్గాల్లో మరో ప్రచారం కూడా సాగుతోంది.. అన్నామలై ఆయన నిర్వహిస్తున్న వియ్ లీడర్స్ అనే ట్రస్టు కార్యకలాపాలు విస్తరింపచేసి దాన్ని రాజకీయ ఉద్యమంగా మార్చే యోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. అయితే, తన కొత్త పార్టీపై ఇప్పటి వరకు అన్నామలై ఎక్కడా ప్రకటన చేయలేదు. ప్రస్తుతం తన రాజీనామాను బీజేపీ అధిష్టానం ఆమోదించడంతో త్వరలో కొత్త పార్టీపై అన్నామలై కీలక ప్రకటన చేస్తారని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతుంది.

కర్ణాటక కేడర్ కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై.. పోలీస్ ఉద్యోగానికి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. పార్టీ అధిష్టానంసైతం అతి తక్కువ కాలంలోనే తమిళనాడు బీజేపీ అధ్యక్ష బాధ్యతలను అన్నామలైకు అప్పగించింది. కేంద్ర పార్టీ అధిష్టానం సూచనలతో.. తనదైన శైలిలో తమిళనాడు రాజకీయాల్లో కీలక నేతగా అన్నామలై ఎదిగారు. ముఖ్యంగా యువతలో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. అదే సమయంలో ద్రవిడ రాజకీయాల కోటలో బీజేపీకి కొత్త ఊపుతెచ్చిన యువ నాయకుడిగా అన్నామలై దేశ రాజకీయాల్లో పేరుగడించారు.

తమిళనాడులో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్ అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంది. ఆ తరువాత అన్నామలైను బీజేపీ రాష్ట్ర అధ్యక్ష స్థానం నుంచి కేంద్ర పార్టీ అధిష్టానం తప్పించింది. అదే సమయంలో పళనస్వామి డిమాండ్ మేరకు అన్నామలైకు అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఇవ్వలేదనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అయితే ఆ ఎన్నికల్లో అన్నాడీఎంకే – బీజేపీ కూటమి మూడో స్థానానికే పరిమితమైంది.