The Kerala Story : ముస్లిం యువకుడిని ప్రేమించిన యువతికి ‘ది కేరళ స్టోరీ’ చూపించిన బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ .. తరువాత యువతి ఏం చేసిందంటే..

ముస్లిం యువకుడిని ప్రేమించిన యువతికి ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ స్వయంగా వెంట తీసుకెళ్లి మరీ ‘ది కేరళ స్టోరీ’ చూపించారు. ఆ తరువాత ఆ యువతి చేసిన పనితో షాక్..

The Kerala Story.. MP Pragya Singh Thakur

The Kerala Story.. MP Pragya Singh Thakur : ‘ది కేరళ స్టోరీ’ (The Kerala Story)సినిమాపై ఎన్ని వివాదాలు వచ్చాయో తెలిసిందే. ఈ సినిమాపై ఆంక్షలు విధించారు.కోర్టులకు వెళ్లారు. కానీ ఈ సినిమాను బీజేపీ నేతలు సమర్థించారు. ప్రధాని మోదీ సైతం ఈ సినిమాకు మద్దతు పలికారు. ఈ సినిమా గురించి విమర్శించేవారిపై విరుచుకపడ్డారు. ఈసినిమా చూడాలని సూచనలు చేశారు. కొంతమంది బీజేపీ నేతలు పనిగట్టుకుని థియేటర్లకు వెళ్లి మరీ సినిమా చూశారు. ఈ సినిమా చూడాల్సినదంటూ సూచించారు. ఎంతోమందిని తమ వెంట తీసుకెళ్లి మరీ సినిమాను చూపించారు.

 

The Kerala Story : ద కేరళ స్టోరీ సినిమా చూసిన కేంద్రమంత్రి, ఆడబిడ్డలను కాపాడుకోవాలని పిలుపు

ఈక్రమంలో వివాదాలకు కేంద్రంగా ఉండే బీజేపీ ఎంపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ మరో అడుగు ముందుకేసి ముస్లిం అబ్బాయిని ప్రేమించి ఓ యువతికి ‘ది కేరళ స్టోరీ’ సినిమా చూపించారు. ముస్లిం అబ్బాయి ప్రేమలో పడిన యువతి మనస్సు మార్చే యత్నంచేశారు. కానీ ఆమె చేసిన యత్నం ఏమాత్రం ఫలించలేదు. పైగా ఆ సినిమా చూసిన తరువాత సదరు యువతి అదే ముస్లిం అబ్బాయితో కలిసి వెళ్లిపోయింది. భోపాల్‌లోని నయా బసేరా ప్రాంతానికి చెందిన 19 ఏళ్ల నర్సింగ్ విద్యార్థిని అదే ప్రాంతానికి చెందిన యూసుఫ్‌ అనే వ్యక్తి ప్రేమలో పడింది. కానీ యూసుఫ్ ఓ రౌడీ షీటర్. అతనిపై ఆరుకు పైగా క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇకపోతే యూసుఫ్ తో వెళ్లిపోయిన యువతికి కూడా మరో వ్యక్తితో వివాహం నిశ్చమైంది. మే 30న ముహూర్తం పెట్టారు.

The Kerala Story : కేరళ స్టోరీకి ఓకే చెప్పిన మోదీ.. నిషేధించిన దీదీ..

ఈక్రమంలో సదరు యువతి మనసు మార్చేందుకు ఎంపీ సాధ్వీ ప్రజ్ఞా ఠాకూర్ రంగంలోకి దిగారు. ఆమెను స్వయంగా వెంట తీసుకెళ్లి మరీ ‘ది కేరళ స్టోరీ’ చూపించారు. ఆ తరువాత యువతి ఇంట్లో కొద్దిపాటి డబ్బు, తన పెళ్లి కోసం ఇంట్లోవారు చేయించిన నగలు పట్టుకుని యూసుఫ్ తో పారిపోయింది.దీంతో యువతి తల్లిదండ్రులు కమ్లా నగర్ లోని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.యూసుఫ్ తమ కూతురికి మాయమాటలు చెప్పి తీసుకెళ్లిపోయారని తమ కూతుర్ని తమకు అప్పగించాలని కోరారు. ఆమెకు మాయమాలు చెప్పి బ్యాంకులో అప్పు కూడా చేయించాడని ఆమెతోనే ఈఎంఐలు కట్టిస్తున్నాడని తెలిపారు. కానీ పారిపోయిన యువతి మాత్రం తన తల్లిదండ్రులు చెప్పేవన్నీ అబద్దాలని..తనను ఎవ్వరు లోబరుచుకుని మాయ చేయలేదని తన ఇష్ట ప్రకారమే యూసుఫ్ తో బయటకు వచ్చేసానని చెబుతోంది.