Rajasthan Election Result 2026: రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ ప్రభంజనం.. గిరిజన ప్రాంతాల్లో భారీ విజయం.. ఘోరంగా దెబ్బతిన్న కాంగ్రెస్!
Rajasthan Elections: : రాజస్థాన్ పురపాలక ఎన్నికల్లో(Rajasthan Municipal Election) అధికార భారతీయ జనతా పార్టీ విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని నిలుపుకుంది.
- V Santhosh Kumar
- Updated on- September 15, 2026 / 11:17 AM IST
BJP secured a massive victory in Rajasthan municipal election results.
- రాజస్థాన్‌లో కమల దళం హవా
- ఘోరంగా దెబ్బతిన్న హస్తం పార్టీ
- ఆసక్తికరంగా మారిన మున్సిపల్ ఫలితాలు
Rajasthan Election Result 2026: రాజస్థాన్ పురపాలక ఎన్నికల్లో అధికార భారతీయ జనతా పార్టీ విజయం సాధించి తమ ఆధిపత్యాన్ని నిలుపుకుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు గిరిజన బెల్ట్‌లోనూ కమలం పార్టీ ఘనవిజయం సాధించగా.. పలుచోట్ల స్వతంత్ర అభ్యర్థులు గట్టి పోటీనిచ్చి ఫలితాల్లో కీలకంగా మారారు.
Read Also – Telangana Rain: తెలంగాణకు భారీ వర్ష సూచన.. మరో రెండు రోజులు వానలే.. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్!
భజన్ లాల్ మార్క్ విజయం.. కాంగ్రెస్ వైఫల్యం:
ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రభుత్వ(Rajasthan Elections) పాలన, యువతకు ఉద్యోగాల కల్పన, పేపర్ లీకేజీల నిరోధక చర్యలే బీజేపీ విజయానికి దోహదపడ్డాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు, కాంగ్రెస్ పార్టీ అంతర్గత విభేదాలు, బలమైన ప్రతిపక్ష పోరాటం లేకపోవడంతో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. అయితే, అర్జున్ రామ్ మేఘ్వాల్ నియోజకవర్గమైన బికనీర్, వసుంధరా రాజే పట్టున్న ఝలావర్‌తో పాటు సీఎంతో సంబంధమున్న భరత్‌పూర్ వంటి కొన్ని కీలక ప్రాంతాల్లో బీజేపీ ఓటమి చవిచూడటం చర్చనీయాంశమైంది.
యోగి అభినందనలు.. నెటిజన్ల ఆసక్తి!
ఈ చారిత్రాత్మక విజయంపై స్పందించిన ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ ప్రజలకు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రధాని మోదీ నాయకత్వానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. కాగా, పర్బత్సర్ కార్పొరేషన్‌లో ఓ అభ్యర్థికి కేవలం ఒక్క ఓటే రావడం, అందులోనూ తన ఓటు కూడా తనకు పడకపోవడం వంటి విచిత్ర పరిణామాలు నెట్టింట వైరల్‌గా మారాయి.
