Actor Sara Ali Khan : కేదార్నాథ్ దర్శనంతో వివాదంలో బాలీవుడ్ నటి సారా అలీఖాన్.. అల్లాహ్‌ను క్షమాపణ కోరాలంటూ ఫత్వా!
Actor Sara Ali Khan : బాలీవుడ్ నటి సారా అలీఖాన్ మతపరమైన వివాదంలో చిక్కుకున్నారు.
- Harish Thanniru
- Published on- October 30, 2026 / 01:59 PM IST
Actor Sara Ali Khan
Actor Sara Ali Khan : బాలీవుడ్ నటి సారా అలీఖాన్ మతపరమైన వివాదంలో చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్‌లోని ప్రసిద్ధ కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించి, అక్కడ ప్రత్యేక పూజలు చేసిన నేపథ్యంలో ఆల్ ఇండియా ముస్లిం జమాత్ అభ్యంతరం తెలిపింది. సంస్థ అధ్యక్షుడు మౌలానా మఫ్తీ రజ్వీ ఆమెకు ఫత్వా జారీ చేశారు. ఇతర మతాల ఆచారాలు పాటించడం ఇస్లాం షరియాకు వ్యతిరేకమని పేర్కొంటూ, అల్లాహ్‌ను క్షమాపణ కోరాలని సూచించారు.
Also Read : Hyderabad Honey Trap Case : హనీట్రాప్ కేసులో కీలక పరిణామం.. పవన్‌కు జ్యుడీషియల్ రిమాండ్!
సారా అలీఖాన్ అక్టోబర్ 25న కేదార్నాథ్ ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో దర్శనంకోసం భక్తులతో కలిసి క్యూలో నిలబడి, పూజలు, హారతిలో పాల్గొన్నారు. సమీపంలోని భుకుంఠ్ భైరవ ఆలయాన్ని కూడా ఆమె సందర్శించారు. అయితే, సారాకు కేదార్‌నాథ్‌తో చాలాకాలంగా అనుబంధం ఉంది. 2018లో దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌తో కలిసి నటించిన ‘కేదార్నాథ్’ సినిమాతోనే ఆమె బాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి తరచూ ఈ ఆలయాన్ని సందర్శిస్తూ, తన పర్యటనకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకుంటున్నారు.
