Captain Abhilasha Barak: ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్‌లో మొట్టమొదటి మహిళా యుద్ధ వైమానిక చోదకురాలిగా అభిలాష బరాక్
క్షణను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం కంబాట్ ఏవియేటర్ గా ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో చేరిన మొట్టమొదటి మహిళా అధికారిణిగా కెప్టెన్ అభిలాషా బరాక్ చరిత్రకెక్కారు
- Bharath Reddy
- Published On : May 25, 2022 / 06:15 PM IST
Female Aviators
Captain Abhilasha Barak: దేశం గర్వించే విధంగా మొట్టమొదటిసారి భారత సైన్యంలో యుద్ధ వైమానిక చోదకురాలు (Combat Aviator)గా కెప్టెన్ అభిలాషా బరాక్ నిలిచింది. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసిన అనంతరం కంబాట్ ఏవియేటర్ గా ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో చేరిన మొట్టమొదటి మహిళా అధికారిణిగా కెప్టెన్ అభిలాషా బరాక్ చరిత్రకెక్కారు. ఈమేరకు బుధవారం నాశిక్ లో జరిగిన కార్యక్రమంలో డైరెక్టర్ జనరల్, కల్నల్ కమాండెంట్ ఆర్మీ ఏవియేషన్ అధికారి..అభిలాషాకు “వింగ్స్” బ్యాడ్జి ప్రధానం చేశారు. ఈకార్యక్రమంలో విజవంతంగా శిక్షణ ముగించిన మరో 36 మంది ఆర్మీ పైలట్లకు అధికారులు బ్యాడ్జీలు ప్రధానం చేశారు. భారత ఆర్మీ ఏవియేషన్ చరిత్రలో “గోల్డెన్ లెటర్ డే అంటూ” భారత ఆర్మీ ఈసందర్భంగా ట్వీట్ చేసింది. ఇంతకు ముందు, ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో మహిళలు గ్రౌండ్ డ్యూటీలలో భాగంగా మాత్రమే ఉండేవారు. గత ఏడాది జూన్లో తొలిసారిగా ఇద్దరు మహిళా అధికారులు హెలికాప్టర్ పైలట్ శిక్షణకు ఎంపికయ్యారు.
Other Stories:PM Modi Gift: జపాన్ ప్రదానికి మోదీ ఇచ్చిన ‘రోగన్ పెయింటింగ్ చెక్కపెట్టె’ గురించి తెలుసా
ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ లో కంబాట్ ఏవియేటర్ శిక్షణ నిమిత్తం మొత్తం 15 మంది మహిళా అధికారులు ఆసక్తి కనబరిచారని.. అయితే పైలట్ ఆప్టిట్యూడ్ బ్యాటరీ టెస్ట్ మరియు మెడికల్ టెస్టుల్లో ఇద్దరు మాత్రమే ఎంపికయి..శిక్షణ పూర్తి చేసినట్లు ఆర్మీ అధికారులు తెలిపారు. వీరిద్దరూ నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్‌లో శిక్షణ పొందారు. ప్రస్తుతం ఆర్మీ విమానయాన విభాగంలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, గ్రౌండ్ డ్యూటీ బాధ్యతలను మహిళలకే అప్పగించారు. అయితే ఇకపై పైలట్ బాధ్యతలు కూడా స్వీకరించనున్నారు. అందుకోసం నాసిక్‌లోని కంబాట్ ఆర్మీ ఏవియేషన్ ట్రైనింగ్ స్కూల్ (CATS)లో ఆర్మీ ఏవియేషన్ కార్ప్స్ అభ్యర్థులు శిక్షణ పొందుతారు. 2018లో, ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్ అవనీ చతుర్వేది యుద్ధ విమానాన్ని నడిపిన మొదటి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు.
Golden Letter Day in the history of #IndianArmy Aviation.
Captain Abhilasha Barak becomes the First Woman Officer to join #ArmyAviationCorps as Combat Aviator after successful completion of training. (1/2)#InStrideWithTheFuture pic.twitter.com/RX9It4UBYA
— ADG PI – INDIAN ARMY (@adgpi) May 25, 2022
