Road Accident : పెళ్లి వేడుకకు వెళ్తుండగా ఘోర ప్రమాదం.. కారు, ట్రక్కు ఢీకొని చెలరేగిన మంటలు.. చిన్నారి సహా 8 మంది సజీవదహనం

కారు ఎదురుగా ఉన్న లేన్‌లోకి దూసుకెళ్లి ట్రక్కును ఢీకొట్టిందని బరేలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుశీల్ చంద్ర భాన్ ధులే తెలిపారు. భోజిపురా సమీపంలోని హైవేపై కారు ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని అధికారి పేర్కొన్నారు.

UP Road Accident : ఉత్తరప్రదేశ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి వేడుకకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చిన్నారి సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. బరేలీలో నిన్న అర్థరాత్రి హైవేపై కారు ట్రక్కును ఢీకొని మంటలు చెలరేగడంతో చిన్నారి సహా ఎనిమిది మంది ప్రయాణికులు సజీవదహనమయ్యారు. సెంట్రల్ లాక్‌ కావడంతో ఏడుగురు పెద్దలు, ఒక చిన్నారి కారులో చిక్కుకుపోయి మరణించినట్లు పోలీసులు తెలిపారు.

ప్రమాద స్థలం నుండి సీసీఫుటేజ్ ప్రకారం.. దగ్ధమైన కారు నైనిటాల్ హైవేపై పక్కనే ట్రక్కుతో కనిపించింది. ప్రమాదం జరిగిన తర్వాత కారు డోర్లు జామ్ కావడంతో తెరుచుకోలేదు. కారు ఎదురుగా ఉన్న లేన్‌లోకి దూసుకెళ్లి ట్రక్కును ఢీకొట్టిందని బరేలీ సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుశీల్ చంద్ర భాన్ ధులే తెలిపారు.

POCSO Cases : ఫాస్ట్ ట్రాక్ కోర్టుల్లో లక్షలాది పోక్సో కేసులు పెండింగ్.. పరిష్కారానికి 9 నుంచి 25ఏళ్లు పట్టే అవకాశం

భోజిపురా సమీపంలోని హైవేపై కారు ట్రక్కును ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయని అధికారి పేర్కొన్నారు. కారు మంటల్లో చిక్కుకుందని తెలిపారు. సెంట్రల్ లాక్ కావడంతో కారు డోర్లు తెరుచుకోకపోవడంతో బయటికి రాలేకపోయారు.

దీంతో మంటలు అంటుకుని కారు లోపల ఉన్న చిన్నారి సహా ఏడుగురు వ్యక్తులు సజీవ దహనం అయ్యారని పేర్కొన్నారు. మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం ఆస్పత్రికి తరలించినట్లు పేర్కొన్నారు. కాగా, ప్రయాణీకులు వివాహానికి హాజరయ్యేందుకు కారులో వెళుతున్నారని తెలిపారు.

ట్రెండింగ్ వార్తలు