కేంద్రం జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ఈ పరిస్థితి దాపరించింది: రాహుల్ గాంధీ

ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 19న జనతా కర్ఫ్యూ ప్రకటించి మార్చి 22న నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఆదివారం జనతా కర్ఫ్యూ రోజు చివర్లోనూ లాక్ డౌన్ గురించి ప్రస్తావించలేదు. పలు రాష్ట్రాలు సమస్యకు తగినట్లు స్పందించి స్వయంగా లాక్ డౌన్ ప్రకటించేశాయి. దేశంలో మార్చి 25 అర్ధరాత్రి నుంచి లాక్ డౌన్ అమలు చేశారు. అప్పటికీ దేశంలో కరోనా కేసు నమోదై 5వ రోజులు పూర్తయ్యాయి. ఒకవేళ ఆలస్యమైనా దేశం మొత్తాన్ని సిద్దం చేసిన తర్వాత లాక్ డౌన్ చేయించారా.. అంటే అదీ లేదు. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సమయానికి ఎక్కడివాళ్లు అక్కడే ఉంటూ మానసికంగానూ సిద్ధం కాలేరు. 

దీనిపై కాంగ్రెస్ లీడర్ రాహుల్ గాంధీ శనివారం కేంద్రంపై విమర్శలు గుప్పించారు. కరోనావైరస్ కారణంగా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని ముందుగా ఎటువంటి ప్లానింగ్ లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని అన్నారు. ‘పనికి సంబంధం లేకుండా  ఎదురవుతున్న సమస్యలతో భవిష్యత్ గందరగోళంగా మారింది. దేశవ్యాప్తంగా అన్నదమ్ములు, ఆడపడుచులు స్వదేశానికి తిరిగొస్తున్నారు. ఇలా వచ్చే ముందు ప్రభుత్వం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోలేదని ట్వీట్ చేశారు. 

కార్మికులు మైళ్ల కొద్దీ దూరం నడిచి ఇళ్లకు పోయే ప్రయత్నం చేస్తున్నారు. కొవిడ్ లాక్ డౌన్ సమయంలో రాష్ట్రంలోకి వెళ్లడం చాలా పెద్ద నేరంగా మారిపోయింది. ప్రభుత్వం దీనికి బాధ్యత వహించాలి. ప్రతి ఒక్కరికీ కనీస సపోర్ట్ మర్యాద చూపించాలి. ప్రభుత్వం ఇక మీదట అయినా వీలైనంత త్వరగా దృఢమైన నిర్ణయాలు తీసుకోవాలి. పెద్ద ప్రమాదం రాకముందే జాగ్రత్త పడాల్సిన అవసరముంది’ 

‘ఇవాళ్టి రోజున దేశంలోని బ్రదర్స్, సిస్టర్స్ ఆకలిదప్పులతో బతుకుతున్నారు. అలాగే మైళ్ల దూరం నడిచి ఇళ్లకు పోతున్నారు. ఎవ్వరూ ఆహారం, నీళ్లు, నివాసం లాంటివి సమకూర్చలేకపోతున్నారు. వేరే మార్గమేది చూపడం లేదు. కాంగ్రెస్ వర్కర్లు, లీడర్ల నుంచి ఏదైనా సహాయం చూపించాలని కోరుకుంటున్నా. జై హింద్’ అని వ్యాఖ్యానించారు.