Chanda Kochhar
Loan Fraud Case: ఐసీఐసీఐ బ్యాంక్ మాజీ సీఈవో, ఎండీ చందాకొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్‌లకు బాంబే హైకోర్టు రుణం మోసం కేసులో సోమవారం మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం విధితమే. వీడియోకాన్ – ఐసీఐసీఐ బ్యాంకు రుణం కేసుకు సంబంధించి సీబీఐ 2023 డిసెంబర్ 23న వీరిద్దరిని అరెస్టు చేసింది. అయితే, తమ అరెస్టు చట్ట విరుద్ధమని పేర్కొంటూ బాంబే హైకోర్టులో పిటీషన్లు దాఖలు చేశారు. సోమవారం ఈ పిటీషన్లపై విచారణ జరిపి బాంబే హైకోర్టు.. కొచ్చర్ దంపతుల అరెస్టు సక్రమంగా జరగలేదని కేంద్ర దర్యాప్తు సంస్థపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
ICICI Loan Case: ఐసీఐసీఐ మాజీ సీఈఓ చందా కొచ్చర్, దీపక్ కొచ్చర్‌కు బాంబే హైకోర్టులో ఊరట..
కొచ్చర్ దంపతులకు పూచీకత్తు కింద చెరో లక్ష చొప్పున డిపాజిట్ చేయాల్సిందిగా ఆదేశిస్తూ బెయిల్ జారీ చేసింది. అయితే, సీబీఐ విచారణకు సహకరించాలని, సమన్లు జారీచేసినప్పుడు హాజరు కావాలని, పాస్ట్ పోర్టులను కూడా సీబీఐకి అప్పగించాలని బాంబే హైకోర్టు కొచ్చర్ దంపతులను ఆదేశించింది. వీలైనంత త్వరగా కొచ్చర్ దంపతులను జైలు నుంచి విడుదల చేయాలని హైకోర్టు అధికారులకు సూచించింది.
Loan fraud case: ఐసీఐసీఐ బ్యాంకు మోసం.. వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ అరెస్ట్
హైకోర్టు సూచనల మేరకు మంగళవారం కొచ్చర్ దంపతులు జైలు నుంచి విడుదలయ్యారు. చందా కొచ్చర్ ముంబైలోని బైకుల్లా మహిళా జైలు నుంచి విడుదలకాగా, ఆమె భర్త దీపక్ కొచ్చర్ ఆర్ధర్ రోడ్ జైలు నుంచి విడుదలయ్యారని పోలీస్ అధికారి తెలిపారు.