Loan fraud case: ఐసీఐసీఐ బ్యాంకు మోసం.. వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ అరెస్ట్
ఈ కేసులో భాగంగా కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్ సంస్థ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. శుక్రవారం కొచ్చర్ దంపతులను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించి అనంతరమే అరెస్టు చేసింది

CBI arrests Videocon group chairman Venugopal Dhoot
Loan fraud case: ఐసీఐసీఐ బ్యాంకు మోసానికి సంబంధించిన కేసులో ఆ బ్యాంకు మాజీ సీఈవో చందా కొచ్చర్, ఆమె భర్త దీపక్ కొచ్చర్లు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. కాగా, ఈ కేసులో తాజాగా వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ దూత్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) అరెస్ట్ చేసింది. 2012 సంవత్సరంలో వీడియోకాన్ గ్రూప్ కంపెనీలకు 3,250 కోట్ల రూపాయల రుణాన్ని ఐసీఐసీఐ మంజూరు చేసింది. ఆ సమయంలో చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంకు సీఈవో. అయితే అది ఎన్పీఏగా మారడంతో కొచ్చర్ కుటుంబం లబ్ధి పొందినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో కూడా ఇదే ఆరోపణ చేసింది.
Maha vs Karnataka: మాకు కాదు, వారికి కాదు.. కర్ణాటకతో సరిహద్దు వివాదంపై శివసేన వింత డిమాండ్
ఈ కేసులో భాగంగా కొచ్చర్ దంపతులతో పాటు వీడియోకాన్ సంస్థ ప్రమోటర్ వేణుగోపాల్ ధూత్, దీపక్ కొచ్చర్‌కు చెందిన న్యూపవర్ రెన్యూవబుల్స్, సుప్రీమ్ ఎనర్జీ, వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్, వీడియోకాన్ ఇండస్ట్రీస్‌లపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన సీబీఐ.. శుక్రవారం కొచ్చర్ దంపతులను సీబీఐ ప్రధాన కార్యాలయంలో ప్రశ్నించి అనంతరమే అరెస్టు చేసింది. ఇక సోమవారం వీడియోకాన్ చైర్మన్ వేణుగోపాల్ దూత్‌ను అరెస్ట్ చేశారు. ఆయనను కూడా తొందరలోనే విచారించనున్నట్లు సమాచారం. ఈ ఆరోపణల కారణంగానే 2018లో చందా కొచ్చర్ ఐసీఐసీఐ బ్యాంక్ సీఈఓ పదవి నుంచి వైదొలిగారు.
Pope Francis: అర్థంపర్థంలేని ఈ యుద్ధాన్ని.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ సందేశం