Amazon Great Republic Day Sale : అమెజాన్ రిపబ్లిక్ డే సేల్ ఆఫర్లు.. ఈ టాప్ 5 స్మార్ట్‌ఫోన్లపై అద్భుతమైన డిస్కౌంట్లు.. ఎప్పటినుంచంటే?
Amazon Great Republic Day Sale : అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ జనవరి 16న ప్రారంభమవుతుంది. ఈ సేల్ సందర్భంగా ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌ఫోన్‌లతో సహా అనేక వస్తువులపై భారీ తగ్గింపులు ఉంటాయి.
Amazon Great Republic Day 2026 (Image Credit To Original Source)
- జనవరి 16 నుంచి అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్
- స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు సహా అనేక ప్రొడక్టులపై భారీ డిస్కౌంట్లు
- ఐఫోన్ 17 ప్రో, శాంసంగ్ S25 అల్ట్రా 5G,వన్‌ప్లస్ 15, ఐక్యూ 15 ఫోన్లపై క్రేజీ ఆఫర్లు
Amazon Great Republic Day Sale : కొత్త ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? అమెజాన్‌లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ అతి త్వరలో రానుంది. జనవరి 16న ఈ సేల్ ప్రారంభమవుతుంది. ఈ సేల్‌లో స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌బడ్‌లు, స్పీకర్లు, స్మార్ట్ టీవీలు, హోం అప్లియన్సెస్ వంటి వివిధ రకాల గాడ్జెట్‌లపై భారీ డిస్కౌంట్లు, మరెన్నో ఆఫర్లను అందిస్తుంది.
కంపెనీ గతంలో మాదిరిగానే 5 అతిపెద్ద స్మార్ట్‌ఫోన్లపై అదిరిపోయే ఆఫర్లను అందించనుంది. ముఖ్యంగా ఆపిల్ ఐఫోన్ 17 ప్రో, శాంసంగ్ S25 అల్ట్రా 5G,వన్‌ప్లస్ 15, ఐక్యూ 15, వివో X300 5జీ వంటి 5 టాప్ ఫోన్లపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. ఈ హై-ఎండ్ ఫోన్‌లపై ఎంత తగ్గింపు అందిస్తుందో ఇప్పుడు చూద్దాం..
వన్‌ప్లస్ 15 :
ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ వన్‌ప్లస్ ఫోన్ అమెజాన్ డీల్ సమయంలో కేవలం రూ. 68,999కు కొనుగోలు చేయవచ్చు. కానీ, ప్రారంభ ధర రూ.76,999కు లభిస్తోంది. ఈ ధరలో ఏదైనా బ్యాంక్ ఆఫర్లు ఉన్నాయో లేదో కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.

Amazon Great Republic Day 2026 (Image Credit To Original Source)
శాంసంగ్ S25 అల్ట్రా 5జీ :
గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సందర్భంగా ఈ హై-ఎండ్ శాంసంగ్ ఫోన్‌ను కేవలం రూ. 1,19,999కి కొనుగోలు చేయవచ్చు. వాస్తవానికి ఈ ఫోన్ ధర రూ. 1,29,999కు లభిస్తోంది. ఈ సేల్‌కు ముందే అమెజాన్ కస్టమర్లకు ఈ ఫోన్‌ను కేవలం రూ. 1,07,250కి పొందే అవకాశాన్ని అందిస్తోంది.
ఐఫోన్ 17 ప్రో :
ఇటీవలే ఆపిల్ అత్యంత ఖరీదైన స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేసింది. ధర రూ. 1,34,900కు లభిస్తోంది. మీరు ఈ ఫోన్ సేల్ సమయంలో రూ. లక్ష కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ డీల్ పూర్తిగా వెల్లడించనప్పటికీ అసలు ధర ఆధారంగా రూ. 99,999 ఉంటుందని అంచనా.
ఐక్యూ 15 :
ఈ సేల్ సమయంలో ఐక్యూ 15 అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ప్రారంభ ధర రూ. 76,999కు లభిస్తోంది. కానీ, ఈ డీల్ సమయంలో కేవలం రూ. 65,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్ ఏఐతో కూడిన అద్భుతమైన కెమెరా, చాలా పవర్‌ఫుల్ ప్రాసెసర్ అందిస్తుంది.
వివో X300 5జీ ఫోన్ :
వివో నుంచి సరికొత్త వివో X300 5జీ ఫోన్ లాంచ్ కాగా ఈ సేల్ సమయంలో చాలా తక్కువ ధరకు లభ్యం కానుంది. ఈ వివో ఫోన్ ప్రారంభ ధర రూ. 83,999గా ఉంది. కానీ, కేవలం రూ. 75,999కి కొనుగోలు చేయొచ్చు.
