Pope Francis: అర్థంపర్థంలేని ఈ యుద్ధాన్ని.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ సందేశం

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికే 300 రోజులు గడిచాయి. పైకి రెండు దేశాల మధ్య యుద్ధంలా కనిపిస్తున్నప్పటికీ ప్రపంచమంతటిపై కొంత ప్రత్యక్షంగా, మరికొంత పరోక్షంగా దీని ప్రభావం పడుతోంది. ఈ యుద్ధంతో ప్రభావితంకాని ప్రపంచ దేశమేదీ లేదంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే, ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే సైనికులు, పౌరులు కలిపి సుమారు లక్ష మంది చనిపోయినట్లు అంచనా.

Pope Francis: అర్థంపర్థంలేని ఈ యుద్ధాన్ని.. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై పోప్ ఫ్రాన్సిస్ సందేశం

Pope urges end to ‘senseless’ Ukraine war in Christmas message

Pope Francis: ఉక్రెయిన్-రష్యా దేశాల మధ్య నెలలుగా కొనసాగుతున్న యుద్ధం అవివేకమైందని పోప్ ఫ్రాన్సిస్ అన్నారు. అర్థంపర్థంలేని ఈ యుద్ధాన్ని వెంటనే నిలిపివేయాలని ఇరు దేశాలకు సందేశం ఇచ్చారు. ఆదివారం వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ బసిలికాలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల సందర్భంగా ఆయన శాంతి సందేశం ఇచ్చారు. ప్రపంచ శాంతి యుద్ధాలతో నెలకొనదని, దానికి ప్రేమ, స్నేహం కావాలని అన్నారు. ఉక్రెయిన్ ప్రజలకు అండగా నిలవాలని పోప్ కోరారు.

Zelensky Christmas message : ‘స్వేచ్ఛ కోసం చాలా కష్టపడాలి’ యుక్రెయిన్ ప్రజలకు జోలన్‍స్కీ క్రిస్మస్ సందేశం

‘‘10 నెలలుగా రెండు దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆహార కొరత ఏర్పడింది. ఆహారాన్ని ఆయుధంగా వాడటాన్ని మానుకోవాలి. ప్రతి ఏడాది క్రిస్మస్ రోజున దీపాల వెలుగుల్లో పండగ చేసుకునే మన ఉక్రెయిన్‌ సోదరసోదరీమణులు, ఈ ఏడాదిన మాత్రం గడ్డకట్టిన చీకటిలో జరుపుకుంటున్నారు. వారికి అండగా నిలిచేలా భగవంతుడు మనలో స్ఫూర్తిని రగిలించాలని నేను కోరుకుంటున్నాను. అదే విధంగా ఈ అవివేకమైన యుద్ధాన్ని ఆపే శక్తి ఉన్న వారి మనుసుల్లో ఆలోచనను కలిగించాలని ప్రార్ధిస్నున్నాను’’ అని పోప్‌ తన సందేశంలో పేర్కొన్నారు.

Nirmala Sitharaman: ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం ప్రారంభమై ఇప్పటికే 300 రోజులు గడిచాయి. పైకి రెండు దేశాల మధ్య యుద్ధంలా కనిపిస్తున్నప్పటికీ ప్రపంచమంతటిపై కొంత ప్రత్యక్షంగా, మరికొంత పరోక్షంగా దీని ప్రభావం పడుతోంది. ఈ యుద్ధంతో ప్రభావితంకాని ప్రపంచ దేశమేదీ లేదంటే అతిశయోక్తి కాదు. ఇకపోతే, ఈ యుద్ధం కారణంగా ఇప్పటికే సైనికులు, పౌరులు కలిపి సుమారు లక్ష మంది చనిపోయినట్లు అంచనా. అయితే ఉక్రెయిన్ ఆర్థికంగా బాగా చితికిపోతున్నట్లు తెలుస్తోంది. ఆ ఆస్తినష్టం ఎంతన్నది అంచనా వేయలేకపోయినా… ఇప్పటికిప్పుడు యుద్ధం ఆపితే ఉక్రెయిన్‌ పునర్‌నిర్మాణానికి సుమారు 349 బిలియన్‌ డాలర్లు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని ప్రపంచ బ్యాంకు ఓ సందర్భంలో పేర్కొంది.