WPL : దంచికొట్టిన హారిస్, స్మృతి మంధాన.. ఆర్సీబీ సూపర్ విక్టరీ..

WPL : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో భాగంగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ యూపీ వారియర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ విజయం సాధించింది.

WPL : దంచికొట్టిన హారిస్, స్మృతి మంధాన.. ఆర్సీబీ సూపర్ విక్టరీ..

WPL 2026 RCB vs UPW Match

Updated On : January 12, 2026 / 11:19 PM IST

WPL 2026 RCB vs UPW Match : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో భాగంగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBw) వర్సెస్ యూపీ వారియర్స్ (UPWw) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ మహిళా ప్లేయర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో ఆర్సీబీ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది.

Also Read : Kl Rauhl : కోహ్లీ వ‌ల్ల కాదు.. అత‌డి వ‌ల్లే నాపై ఒత్తిడి త‌గ్గింది.. నిజంగా ఆ విష‌యం నాకు తెలియ‌దు.. కేఎల్ రాహుల్ కామెంట్స్‌..

ఆర్సీబీ ఓపెనర్లు గ్రేస్ హారిస్, స్మృతి మంధాన అద్భుత బ్యాటింగ్ చేశారు. గ్రేస్ హారిస్ క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచి ఫోర్లు, సిక్సర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 85 పరుగులు చేసింది. ఇందులో 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.


డాటిన్ వేసిన ఆరో ఓవర్లో హారిస్ చెలరేగింది. మూడు ఫోర్లు, మూడు సిక్సులు బాదింది. కేవలం 22 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు.. స్మృతి మంధాన (47 నాటౌట్) కూడా రాణించడంతో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆర్సీబీ జట్టు విజయాన్ని దక్కించుకుంది.


ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ ఉమెన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో దీప్తి శర్మ (45 నాటౌట్), డియాండ్రా డాటిన్ (40 నాటౌట్) రాణించారు.

తొలుత యూపీ వారియర్స్  జట్టు 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును దీప్తి శర్మ, డాటిన్ చివరి వరకు క్రీజులో ఉండి 143 పరుగులకు చేర్చారు. స్వల్ప లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు కేవలం 12.1 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది.