WPL 2026 RCB vs UPW Match
WPL 2026 RCB vs UPW Match : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ (WPL 2026)లో భాగంగా సోమవారం రాత్రి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCBw) వర్సెస్ యూపీ వారియర్స్ (UPWw) జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ మహిళా ప్లేయర్లు అద్భుత ప్రదర్శన చేశారు. దీంతో ఆర్సీబీ జట్టు తొమ్మిది వికెట్ల తేడాతో సూపర్ విక్టరీ సాధించింది.
ఆర్సీబీ ఓపెనర్లు గ్రేస్ హారిస్, స్మృతి మంధాన అద్భుత బ్యాటింగ్ చేశారు. గ్రేస్ హారిస్ క్రీజులోకి వచ్చిన దగ్గర నుంచి ఫోర్లు, సిక్సర్లతో ధనాధన్ ఇన్నింగ్స్ ఆడింది. కేవలం 40 బంతుల్లో 85 పరుగులు చేసింది. ఇందులో 10 ఫోర్లు, ఐదు సిక్సర్లు ఉన్నాయి.
8⃣5⃣ runs
4⃣0⃣ deliveries
1⃣0⃣ fours
5⃣ sixesRelive the 𝗚𝗿𝗮𝗰𝗲 𝗛𝗮𝗿𝗿𝗶𝘀 𝘀𝘁𝗼𝗿𝗺 that took over Navi Mumbai tonight 🌪️#TATAWPL | #KhelEmotionKa | #RCBvUPW https://t.co/zPnIrccAFA
— Women’s Premier League (WPL) (@wplt20) January 12, 2026
డాటిన్ వేసిన ఆరో ఓవర్లో హారిస్ చెలరేగింది. మూడు ఫోర్లు, మూడు సిక్సులు బాదింది. కేవలం 22 బంతుల్లోనే ఆఫ్ సెంచరీ పూర్తి చేసుకుంది. మరోవైపు.. స్మృతి మంధాన (47 నాటౌట్) కూడా రాణించడంతో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి ఆర్సీబీ జట్టు విజయాన్ని దక్కించుకుంది.
Some more Grace Harris SIXES 💥💥
What an outing for the @RCBTweets opener!
Updates ▶️ https://t.co/U1cgf01ys0#TATAWPL | #KhelEmotionKa | #RCBvUPW pic.twitter.com/VSBfPRUxk0
— Women’s Premier League (WPL) (@wplt20) January 12, 2026
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన యూపీ వారియర్స్ ఉమెన్స్ జట్టు నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. యూపీ బ్యాటర్లలో దీప్తి శర్మ (45 నాటౌట్), డియాండ్రా డాటిన్ (40 నాటౌట్) రాణించారు.
Down the ground and over the ropes! 🔥
A valuable knock that from the experienced Deepti Sharma 👏👏
Updates ▶️ https://t.co/U1cgf01ys0 #TATAWPL | #KhelEmotionKa | #RCBvUPW pic.twitter.com/WTSICiWkH1
— Women’s Premier League (WPL) (@wplt20) January 12, 2026
తొలుత యూపీ వారియర్స్ జట్టు 50 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును దీప్తి శర్మ, డాటిన్ చివరి వరకు క్రీజులో ఉండి 143 పరుగులకు చేర్చారు. స్వల్ప లక్ష్యాన్ని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్ జట్టు కేవలం 12.1 ఓవర్లలోనే ఒకే వికెట్ కోల్పోయి ఛేదించింది.
Dominant! ❤️@RCBTweets go 🔝 of the #TATAWPL 2026 points table with a clinical 9⃣-wicket victory 👏
Scorecard ▶️ https://t.co/U1cgf01ys0 #KhelEmotionKa | #RCBvUPW pic.twitter.com/kjOFG7pjiJ
— Women’s Premier League (WPL) (@wplt20) January 12, 2026