Chennai Hotel Bill : ఓరేయ్.. ఎవర్రా నువ్వు..! ఇడ్లీ, వడతోపాటు గ్యాస్ ఛార్జీలతో బిల్లు.. నెటిజన్లు ఫుల్ ఫైర్

Chennai Hotel Bill : చెన్నైలోని ఓ హోటల్‌ బిల్లు నెట్టింట వైరల్‌గా మారింది. ఎందుకంటే ఇడ్లీ, వడతో పాటు గ్యాస్‌ బిల్లునూ అందులో చేర్చడమే కారణం.

Chennai Hotel Bill

Chennai Hotel Bill : పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న యుద్ధం భారత దేశంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. భారతదేశంలో పెట్రోల్, డీజిల్‌తోపాటు గ్యాస్‌పైనా యుద్ధం ప్రభావం చూపుతోంది. యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడింది. దీంతో గ్యాస్ సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు.. కమర్షియల్ గ్యాస్ సిలీండర్ల కొరత ఏర్పడడంతో పలు నగరాల్లోని హోటళ్లు, రెస్టారెంట్లు మూతపడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సోషల్ మీడియాలో ఓ హోటల్‌కు సంబంధించిన బిల్లు వైరల్ అవుతోంది. ఈ బిల్లును చూసిన నెటిజన్లు ఓరేయ్.. ఎవర్రా నువ్వు.. ఇదేం బాదుడు.. అంటూ ఒకింత ఆగ్రహంతోపాటు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : Andhra Pradesh : ఏపీలోని కాలేజీ విద్యార్థులకు గుడ్‌న్యూస్.. అకౌంట్లలోకి డబ్బులు.. పంతం నెగ్గించుకున్న కాలేజీ యాజమాన్యాలు..

చెన్నైలోని పెరుంగుడి ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఓ కస్టమర్ ఇడ్లీ, వడ టిఫిన్ చేశాడు. ఒక్కోటి రూ.33.33గా బిల్లు చేశారు. దీనిపై 5శాతం జీఎస్టీ కలిపి మొత్తం రావాల్సి బిల్లులో.. అదనంగా రూ.9.52 అని వేసి ఉంది. ఇదేంది అని తీక్షణంగా చూడగా.. గ్యాస్ ఛార్జీ కింద హోటల్ యాజమాన్యం రూ.9.52 అదనంగా వేసినట్లు గమనించి సదరు కస్టమర్ అవాక్కయ్యాడు. ప్రస్తుతం ఈ బిల్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఈ బిల్లును చూసిన నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు. కొందరు నెటిజన్లు హోటల్ యాజమాన్యంపై విమర్శలు చేస్తున్నారు. ఇదేం కొత్త వసూళ్లు..? హోటల్‌లో వంట చేస్తే గ్యాస్ ఖర్చు బిల్లులో వేయడం సరైనదా..? అంటూ ప్రశ్నలు లేవనెత్తారు. మరికొందరు.. హోటల్ నడపడం భారం అయితే మూసేసుకోవాలి.. కానీ, ఇష్టానుసారంగా బిల్లులు వేస్తే ఎలా అంటూ ప్రశ్నించారు.

అయితే, ఈ విషయమై హోటల్ యాజమానిని ప్రశ్నించగా.. ఇది ఫేక్ బిల్లు అని.. ఎవరో బిల్లును ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని చెప్పారు. తమ హోటల్‌లో గ్యాస్ వినియోగానికి సంబంధించి ఎలాంటి ఛార్జీలు వసూలు చేయమని స్పష్టం చేశారు.