China Bridge Pangong lake:పాంగాంగ్‌పై బ్రిడ్జి నిర్మాణాన్ని అంగీకరించే ప్రసక్తే లేదు..చైనాకు భారత్ వార్నింగ్

లడఖ్ లోని గాల్వన్ లోయలో పాంగాంగ్ సరస్సుపై చైనా నిర్మిస్తున్న బ్రిడ్జీ నిర్మాణాన్ని భారత్ అంగీకరించదని కేంద్రం ప్రభుత్వం లోక్ సభకు వెల్లడించింది.

Chinese bridge on Pangong lake in illegally : తూర్పు లడఖ్ లోని గాల్వన్ లోయలో పాంగాంగ్ సరస్సుపై తూర్పు లడాఖ్‌లోని ప్యాంగాంగ్ సరస్సు మీదుగా 1962 నుంచి అక్రమంగా అధీనంలో ఉంచుకుంటున్న ఏరియాలో చైనా ఓ బ్రిడ్జీ నిర్మిస్తోందని దీన్ని భారత్ ఏమాత్రం సహించదని కేంద్ర ప్రభుత్వం శుక్రవారం (ఫిబ్రవరి 5,2022)పార్లెమంట్ కు తెలిపింది.విదేశాంగ శాఖ సహాయం మంత్రి వి.మురళీధరన్ లోక్ సభకు ఈ విషయాన్ని తెలిపారు.భౌ గోళిక సమగ్రతను ఎదుటి దేశం కచ్చితంగా గౌరవించి తీరాలని భారత్ ఆశిస్తోందని తెలిపారు.

ప్యాంగాంగ్ సరస్సుపై చైనా వంతెన కడుతున్న విషయాన్ని తాము గుర్తించామని కేంద్ర ప్రభుత్వం పార్లమెంటుకు ఇచ్చిన రాతపూర్వక సమాధానం మంత్రి తెలిపారు.1962 నుంచి అక్రమంగా అధీనంలో ఉంచుకుంటున్న భూభాగంలో చైనా నిర్మిస్తున్నదని..కానీ భారత ప్రభుత్వం ఈ ఆక్రమణను అంగీకరించలేదని స్పష్టం చేశారు. కేంద్ర పాలిత ప్రాంతాలు జమ్ము కశ్మీర్, లడాఖ్‌లు భారత దేశంలో అంతర్భాగాలని చాలా సార్లు కేంద్రం స్పష్టం చేసిందని..మరోసారి ప్రభుత్వం సభకు స్పష్టంచేసింది. అదే సమయంలో వేరే దేశాలూ భారత సార్వభౌమత్వాన్ని, భౌగోళిక సమగ్రతను గౌరవించాలని వెల్లడించింది. ఏ దేశమూ ఏకపక్షంగా వ్యవహరించకూడదని తెలిపింది. ఒప్పందాలకు ఆయా దేశాలు కట్టుబడి ఉండాలని తెలిపింది.

Also read : US Defence Report : అరుణాచల్ ప్రదేశ్ లో 100 ఇళ్ల చైనా గ్రామం..యూఎస్ రిపోర్ట్

అదే సమయంలో చైనా దేశం కొన్నాళ్లుగా భారత భూభాగంలోని గ్రామాల పేర్ల మార్పునూ ప్రస్తావించింది. భారత రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని గ్రామాల పేర్లను చైనా మారుస్తున్నట్టుగా కొన్ని వార్తలు తమ దృష్టికి వచ్చాయనీ వివరించింది. ఇది కేవలం నిరర్ధకమైన పని అని, అరుణాచల్ ప్రదేశ్ ఎప్పటికీ భారత్‌లోని అంతర్భాగమేనని తెలిపింది. ఈ సత్యంలో మార్పేమీ రాదని స్పష్టం చేసింది.

కాగా, గాల్వన్ లోయలో జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ఇరు దేశాల మధ్య మళ్లీ శాంతియుత వాతావరణం నెలకొడానికి చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. బలగాల ఉపసంహరణ ప్రక్రియ కూడా కొనసాగుతోంది. దీనిపై కేంద్రం స్పందిస్తూ.. ఈ శాంతి చర్చలపై భారత్ మూడు అంశాలను ఆధారంగా తీసుకుని వ్యవహరిస్తుందని వివరించింది. ఒకటి, ఇరువైపులా ఎల్ఏసీ సరిహద్దును గుర్తించి గౌరవించడం; రెండు, యథాతథస్థితిని ఏకపక్షంగా మార్చే ప్రయత్నాలు ఇరువైపులా జరగకూడదు; మూడు; ఉభయ దేశాలూ అన్ని ఒప్పందాలను కచ్చితత్వంతో పాటించడం అని తెలిపింది.

2020లో భారత బలగాలు, చైనా పీఎల్ఏ ఆర్మీ ఎదురుపడిన విషయం తెలిసిందే. పెట్రోలింగ్ గ్రూపుల మధ్య ఘర్షణ.. ఆ తర్వాత హింసాత్మకంగా మారిన సంగతి తెలిసిందే. ఈ స్టాండఫ్ నెలకొన్నప్పుడు చైనా ఫీల్డ్ హాస్పిటళ్లు, ట్రూపుల అకామడేషన్ నిర్వహించిన చోటుకు ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరానం ఉంది. ఇప్పుడు కొత్తగా చైనా నిర్మిస్తున్న బ్రిడ్జీ ఈ చోటుకు దక్షిణం వైపున ఉంది. ఈ బ్రిడ్జీ నిర్మాణం మరోసారి ఉభయ దేశాల మధ్య వైరాన్ని మరింతగా పెంచేలా ఉంది.

Also read :

చైనాతో ఉన్న లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ సరిహద్దుపై చైనాకు భిన్నమైన అభిప్రాయాలు ఉన్నాయి. చైనా దానికదిగా తన సరిహద్దును వేరుగా గుర్తించుకుంటున్నది. భారత భూభాగాలను కొంత మేర తనలో కలుపుకుని తన సరిహద్దుగా చెప్పుకుంటోంది. దీన్ని భారత్ ఎప్పటి నుంచో తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే.

కాగా..చైనా భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నట్లుగా వ్యవహరిస్తోంది.సరిహద్దు ప్రాంతాల్లో ఇష్టానురీతిగా వ్యవహరిస్తోంది.పలు నిర్మాణాలు చేస్తోంది. భారత్, చైనా బలగాల మధ్య జరిగిన హింసాత్మక ఘర్షణల తర్వాత ఇప్పటికీ ఇంకా శాంతి స్థిరత్వం నెలకొనలేదు. అందుకోసం చాలాసార్లు మిలిటరీ, దౌత్యపరమైన చర్చలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. నోరు ఒకటి మాట్లాడితే నొసలు ఇంకోటి మాట్లాడినట్టు ఒక వైపు శాంతి చర్చలు జరుపుతూనే మరోవైపు కవ్వింపులకు దిగుతోంది. దీంట్లో భాగంగానే సరిహద్దు ప్రాంతాల్లో పాటించాల్సిన నిబందనల్ని బేఖాతరు చేస్తోంది.

ట్రెండింగ్ వార్తలు