CM Revanth Reddy : హైదరాబాద్ డ్రగ్స్‌కు గోవానే అడ్డా..? బీజేపీ పాలనపై సీఎం రేవంత్ ఫైర్..

CM Revanth Reddy : రేవంత్ రెడ్డి గోవాలో డ్రగ్స్‌ సమస్యపై బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. హైదరాబాద్‌లో డ్రగ్స్‌ సరఫరా, ఈగల్ ఫోర్స్ చర్యలు, గోవా రాజకీయాలపై సీఎం రేవంత్ మండిపడ్డారు.

CM Revanth Reddy Goa

  • గోవాలో డ్రగ్స్‌ సమస్యపై రేవంత్ రెడ్డి ఫైర్
  • గోవాలో కాంగ్రెస్ జెండా ఎగురుతుంది
  • డ్రగ్స్ కట్టడిలో బీజేపీ విఫలమైందా?
  • బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు

CM Revanth Reddy : గోవాలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా పెరుగుతోందని, ఈ సమస్యను అరికట్టడంలో బీజేపీ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. హైదరాబాద్‌లో పట్టుబడుతున్న డ్రగ్స్‌కు గోవా కేంద్రంగా ఉందని ఆయన ఆరోపించారు. గోవాలో పర్యాటక రంగానికి మంచి గుర్తింపు ఉన్నప్పటికీ, డ్రగ్స్‌ కారణంగా రాష్ట్ర ప్రతిష్ఠ దెబ్బతింటోందని వ్యాఖ్యానించారు.

ఆదివారం (అక్టోబర్ 11) గోవాలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ‘గోయ్ రాభోన్న్’ పాదయాత్రలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తూ.. గోవాలో మాదకద్రవ్యాల సమస్యను పరిష్కరించేందుకు బీజేపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై ప్రశ్నలు సంధించారు.

Read Also : Pakistan Emergency : పాకిస్థాన్‌లో ఎమర్జెన్సీ ప్రకంపనలు.. ఇమ్రాన్ ఖాన్ పార్టీ ప్రభుత్వంపై వేటు!

ఈగల్ ఫోర్స్ ఏర్పాటు చేశాం :
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు హైదరాబాద్‌లో డ్రగ్స్‌ వ్యవహారాలు ఎక్కువగా కనిపించేవని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మాదకద్రవ్యాల నియంత్రణకు ప్రత్యేకంగా ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డ్రగ్స్‌ సరఫరా, వినియోగాన్ని అరికట్టేందుకు తమ ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

ప్రధాని నరేంద్ర మోదీ నషా ముక్త్ భారత్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో గోవాలో ఆ లక్ష్యాన్ని ఎందుకు అమలు చేయడం లేదని గోవా సీఎం ప్రమోద్ సావంత్‌ను రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. కేంద్రంలోనూ, గోవాలోనూ బీజేపీ ప్రభుత్వాలే ఉన్నాయని గుర్తుచేశారు. డ్రగ్స్‌ అక్రమ రవాణాను నియంత్రించడంలో ఎదురవుతున్న వైఫల్యాలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.

డ్రగ్స్‌ సమస్యతో పాటు ప్రభుత్వ భూముల కేటాయింపులు, పర్యావరణ పరిరక్షణ అంశాలపైనా బీజేపీ ప్రభుత్వాన్ని ఆయన విమర్శించారు. గోవా ప్రజల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం తథ్యం :
త్వరలో జరగనున్న గోవా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తప్పక విజయం సాధిస్తుందని రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్ర ప్రజలకు మెరుగైన పాలన అందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.