CM Vijay – Trisha : ప్రమాణ స్వీకారోత్సవం వేదికగా త్రిషకు బిగ్ షాకిచ్చిన విజయ్.. ఆ రూమర్స్‌కు చెక్..!
CM Vijay - Trisha : తమిళనాడు సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశాడు.
CM Vijay
CM Vijay – Trisha : తమిళనాడు సీఎంగా టీవీకే అధినేత విజయ్ ప్రమాణ స్వీకారం చేశారు. చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ ఇండోర్ స్టేడియంలో భారీ సంఖ్యలో తరలివచ్చిన ప్రజల హర్షధ్వానాల మధ్య విజయ్ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ ఆర్లేకర్ విజయ్ తో ప్రమాణం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవం అనంతరం విజయ్ మూడు ఫైళ్లపై సంతకాలు చేశారు. ఆ తరువాత విజయ్ మాట్లాడుతూ.. తనపై వస్తున్న రూమర్స్ కు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
విజయ్ మాట్లాడుతూ.. జవాబుదారీ, పారదర్శక పాలన అందిస్తామని, తనకు అప్పగించిన బాధ్యతలో ప్రజలను నిరాశపర్చబోనని హామీ ఇచ్చారు. మీరు నాకు చాలా పెద్ద బాధ్యత అప్పగించారు. కానీ, హామీల అమలుకు నాకు కొంత సమయం ఇవ్వాలని మిమ్మల్ని కోరుతున్నా. నేను ఎప్పటికీ తప్పు చేయను అంటూ చెప్పుకొచ్చాడు. నటుడిగా రాజకీయ నాయకుడిగా మారిన నేను.. ఎన్నో సవాళ్లను, ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నా. కష్ట సమయాల్లో నాకు అండగా నిలిచిన ప్రజలకు, టీవీకే కార్యకర్తలకు విజయ్ ధన్యవాదాలు చెప్పారు.
ముఖ్యమంత్రిగా ప్రజలకు పారదర్శకమైన పాలన అందిస్తాం. నిజాయితీగా పనిచేస్తాం. తమ ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ఉంటుంది. జవాబుదారీగా ఉంటుందని హామీ ఇస్తున్నా అంటూ విజయ్ చెప్పారు. నేను ఏ విషయాన్ని దాచను.. అన్ని విషయాలను ప్రజల ముందుంచుతా. పాలనలో గోప్యతను పాటించే ప్రభుత్వంగా టీవీకే ప్రభుత్వం ఉండదని విజయ్ చెప్పుకొచ్చారు. మహిళల భద్రతపై ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని, రాష్ట్రంలో మాదకద్రవ్యాల విక్రయాలను అరికట్టేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని, ఈరోజు నుంచే అది ప్రారంభమవుతుందని విజయ్ చెప్పారు.
విద్యార్థుల కోసం విజయ్ మామ అన్నీ మంచి పనులే చేస్తాడు. రైతులు, మత్స్యకారులు, అన్ని వర్గాల వారిని టీవీకే ప్రభుత్వం ఆదుకుంటుందని విజయ్ స్పష్టం చేశారు. టీవీకే కార్యకర్తలారా, మీ అందరికీ నేను ధన్యవాదాలు చెప్పాలి. మీరే నా ప్రాణం, మీరు లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. మనమందరం కలిసి సరికొత్త పాలన అందిద్దామని విజయ్ చెప్పారు.
టీవీకే ప్రభుత్వంలో శత్రువులైనా, మిత్రులైనా అందరికీ ఒకే చట్టం వర్తిస్తుంది. బంధుప్రీతికి తావులేదని విజయ్ తేల్చి చెప్పారు. ఇదే సమయంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. నాకు విజయ్ తెలుసు, మనం ఏం చెబితే అది నడుస్తుంది అనే అభిప్రాయం ఎవరికైనా ఉంటే ఆ అభిప్రాయాలు పక్కన పెట్టండి. ఒకే ఒక పవర్ సెంటర్. అది విజయ్‌నే. అటువైపు ఒక పవర్ సెంటర్, ఇటువైపు ఇంకో పవర్ సెంటర్ ఉండదు అంటూ విజయ్ పేర్కొన్నారు. దీంతో విజయ్, త్రిషలపై తమిళనాడులో, సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. విజయ్ టీవీకే పార్టీ అధికారంలోకి వస్తే త్రిష హవా నడుస్తోందన్న చర్చ తమిళ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. త్రిష ఏం చెబితే విజయ్ అది చేస్తాడనే చర్చ సోషల్ మీడియాలో కొనసాగుతోంది.. దీంతో ఆ చర్చలకు విజయ్ చెక్ పెట్టినట్లయిందని టీవీకే వర్గాలు పేర్కొంటున్నాయి.
