CNG Price Hike : వాహనదారులకు బిగ్ షాకిచ్చిన కేంద్రం.. సీఎన్‌జీ ధరలు మళ్లీ పెరిగాయ్.. ఈసారి భారీగా..
CNG Price Hike : కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాకిచ్చింది. ఎంజీఎల్ కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలను మరోసారి పెంచింది.
- Harish Thanniru
- Updated on- May 17, 2026 / 10:20 AM IST
CNG Price Hike
CNG Price Hike : కేంద్ర ప్రభుత్వం వాహనదారులకు బిగ్ షాకిచ్చింది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ) ధరలను మరోసారి పెంచింది. రెండు రోజుల క్రితమే పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతోపాటు కిలో సీఎన్‌జీ పై రూ. 2 పెంచిన కేంద్రం.. తాజా మరోసారి సీఎన్‌జీ ధరలను పెంపు చేసింది. కిలో సీఎన్‌జీపై రూపాయి చొప్పున పెంచింది. ఈ మేరకు ఆదివారం ప్రకటన చేసింది. తాజా పెంపుతో ఢిల్లీలో కిలో సీఎన్‌జీ ధర రూ.80.90కి చేరింది. నోయిడా, ఘాజియాబాద్ లో రూ.88.70కు చేరింది. హైదరాబాద్ నగరంలో కిలో సీఎన్‌జీ గ్యాస్ ధర రూ.97గా ఉంది. ప్రస్తుతం పెంపుతో రూ.98కి చేరినట్లు తెలుస్తోంది.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న నేపథ్యంలో హర్మూజ్ జలసంధిపై నౌకల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ క్రమంలో ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో ప్రభుత్వ రంగ చమురు కంపెనీలపై ఉన్న ఆర్థిక ఒత్తిళ్లు తగ్గించేందుకు కేంద్రం ఇటీవల దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలను పెంచింది. లీటరు పెట్రోల్, డీజిల్‌పై సగటున రూ.3 పెరిగింది. సీఎన్‌జీ కిలోకు రూ.2 పెంచింది. తాజాగా.. మరోసారి సీఎన్‌జీ ధరను రూ.1 పెంచుతూ కేంద్రం నిర్ణయం తీసుకుంది.
