×
Ad

Karnataka BJP : సీఎం సమక్షంలోనే రాష్ట్ర మంత్రి, కాంగ్రెస్ ఎంపీ వాగ్వివాదం

కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరైన కార్యక్రమంలో రాష్ట్రమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది.

  • Published On : January 3, 2022 / 04:49 PM IST

Karnataka Bjp Congress Fight

Karnataka BJP :  కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై హాజరైన కార్యక్రమంలో రాష్ట్రమంత్రి, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య గొడవ జరిగింది. సోమవారం రామనగర్ పట్టణంలో జరిగిన ఒక కార్యక్రమంలో సీఎం బసవరాజ్ బొమ్మై, రాష్ట్ర మంత్రి డాక్టర్ అశ్వత్థ్ నారాయణ్, కాంగ్రెస్, జేడీఎస్ లతో పాటు ఇతర పార్టీల నేతలు పాల్గోన్నారు.

కార్యక్రమంలోమంత్రి అశ్వత్థ్ నారాయణ రాష్ట్రంలో బీజేపీ చేసిన అభివృధ్ది గురించి వివరిస్తుండగా గొడవ మొదలయ్యింది. మంత్రి ప్రసంగం పట్ల కాంగ్రెస్ నేతలు అభ్యంతరం చెప్పారు.  మంత్రి అబధ్దాలు చెపుతున్నారంటూ ఒక కాంగ్రెస్ నేత పోడియం వద్దకు దూసుకు వెళ్ళారు.

Also Read : BJP MP Bandi Sanjay : బండి సంజయ్‌ బెయిల్ పిటీషన్ కొట్టివేత-14 రోజుల రిమాండ్

అదే సమయంలో వేదికపై ఉన్నకాంగ్రెస్ ఎంపీ డీకే సురేష్ కూడా పోడియం దగ్గరకువెళ్ళి మంత్రితో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్బంగా తీవ్ర గందరగోళం నెలకొంది, దాంతో పోలీసులు, నేతల సెక్యూరిటీ సిబ్బంది కలుగ చేసుకుని గొడవను సర్దుమణిచారు. సీఎం  బసవరాజ్ బొమ్మై ఎదుటే ఇదంతా జరుగుతున్నా ఆయన చూస్తూ ఉరకుండిపోయారు.