×
Ad

PM Modi: ప్రధాని మోదీపై దాడికి కాంగ్రెస్ ప్లాన్..? లోక్‌సభ వర్గాల సంచలన ప్రకటన

ఈ సమాచారం రావడంతోనే ప్రసంగించేందుకు మోదీ అందుబాటులోనే ఉన్నప్పటికీ సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారని లోక్ సభ వర్గాలు పేర్కొనాయి.

  • Published On : February 5, 2026 / 07:18 PM IST

Pm Modi Representative Image (Image Credit To Original Source)

  • ప్రధాని మోదీపై దాడికి కుట్ర?
  • ప్రధాని కుర్చీని చుట్టుముట్టి దాడికి కాంగ్రెస్ మహిళా ఎంపీల ప్లాన్?
  • దాడి ప్లాన్ తెలిసే బుధవారం లోక్ సభ వాయిదా వేసినట్లు సెక్రటరీ ప్రకటన

PM Modi: ప్రధాని మోదీపై దాడికి ప్లాన్ జరిగినట్లు లోక్ సభ వర్గాలు ప్రకటించడం సంచలనంగా మారింది. లోక్ సభలో మోదీని చుట్టుముట్టి దాడి చేసేందుకు కాంగ్రెస్ ప్లాన్ చేసినట్లు సమాచారం రావటంతో సభను వాయిదా వేసినట్లు లోక్ సభ వర్గాలు వెల్లడించాయి. దీంతో ఆయన ప్రసంగం లేకుండానే రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని లోక్ సభ ఇవాళ ఆమోదించింది.

బుధవారం అంతా లోక్ సభలో ఆందోళనలు చేసిన ప్రతిపక్షం నేతలు మోదీ ప్రసంగించే సమయంలో చుట్టుముట్టి దాడి చేయాలని ప్లాన్ చేసినట్లు పక్కా సమాచారం వచ్చిందన్నాయి లోక్ సభ వర్గాలు. మోదీపై దాడి చేసేందుకు మహిళా ఎంపీలను పంపినట్లుగా ప్రకటించాయి. ఈ సమాచారం రావడంతోనే ప్రసంగించేందుకు మోదీ అందుబాటులోనే ఉన్నప్పటికీ సభను వాయిదా వేయాలని స్పీకర్ నిర్ణయించారని లోక్ సభ వర్గాలు పేర్కొనాయి.

ప్రధాని మోదీపై దాడికి విపక్షాలు కుట్ర చేశాయని లోక్ సభ సెక్రటరీ సంచలన ప్రకటన విడుదల చేసింది. మహిళా ఎంపీలు అంతా కలిసి మోదీ కుర్చీని చుట్టుముట్టి అటాక్ చేసేందుకు ప్లాన్ చేశారంటూ ఆ ప్రకటనలో పేర్కొన్నారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో స్పీకర్ ఓం బిర్లా రాష్ట్రపతి ప్రసంగంపై ప్రధాని మోదీ మాట్లాడకుండానే తీర్మానాన్ని ఆమోదించాల్సి వచ్చిందని తెలిపారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో ఇవాళ కొంత అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధాని మోదీ ప్రసంగించాల్సిన సమయంలో విపక్ష సభ్యులంతా పోడియం వైపుకు రావడం, వెనకాల బీజేపీ ఎంపీలు కూర్చునే ప్లేస్ నుంచి మహిళా ఎంపీలంతా ప్రధాని కుర్చీవైపు రావడాన్ని గమనించారు.

విపక్ష సభ్యుల నినాదాలతో సభ ప్రారంభమైన కొద్ది సేపటికే వాయిదా పడింది. విపక్షాలకు చెందిన కొందరు మహిళా ఎంపీలు ప్రధాని మోదీ కూర్చునే కుర్చీని చుట్టుముట్టడం జరిగింది. ప్రధాని సభలోకి రాకుండా అడ్డుకోవడమే ఈ చర్య ఉన్నట్లు ట్రెజరీ బెంచ్ సభ్యులు కూడా ఆరోపించారు. దీనికి సంబంధించి లోక్ సభ సెక్రటరీ నుంచి ఒక ప్రకటన విడుదలైంది. ప్రధాని మోదీపై దాడికి కుట్ర చేశారని లోక్ సభ సెక్రటరీ అందులో పేర్కొన్నారు.

Also Read: ఎప్‌స్టీన్‌తో సంబంధాలపై స్పందించిన బిల్‌గేట్స్.. నేను చేసిన పెద్దతప్పు అదే.. పశ్చాత్తాపంతో క్షమాపణలు చెబుతున్నా!