బూట్లతో పోలీసుల డిష్యుం డిష్యూం

విచక్షణారహితంగా కొట్టిన సందర్భాలు విన్నాం. కానీ, వాళ్లలో వాళ్లే బూట్లతో కొట్టుకోవడం మహారాష్ట్రలో జరిగింది. బాంద్రాలో ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై బూట్లతో కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది.

విచక్షణారహితంగా కొట్టిన సందర్భాలు విన్నాం. కానీ, వాళ్లలో వాళ్లే బూట్లతో కొట్టుకోవడం మహారాష్ట్రలో జరిగింది. బాంద్రాలో ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై బూట్లతో కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది.

పోలీసులు తప్పు చేసిన వారికి బుద్ధి చెప్పడం చూశాం. విచక్షణారహితంగా కొట్టిన సందర్భాలు విన్నాం. కానీ, వాళ్లలో వాళ్లే బూట్లతో కొట్టుకోవడం మహారాష్ట్రలో జరిగింది. బాంద్రాలో ఇద్దరు పోలీసులు నడిరోడ్డుపై బూట్లతో కొట్టుకున్న ఘటన చోటు చేసుకుంది. పోలీసులు ఇలా చేస్తుండటంతో స్థానికులు వారిని ఆపకుండా వీడియోలు తీస్తూ చోద్యం చూస్తూ నిలుచున్నారు. 

కొందరు ఫోన్లలో వీడియోలు తీసుకుంటూ నిల్చున్నారు. ముందుగా చెంపదెబ్బలతో మొదలైన వారి గొడవ బూట్ల దెబ్బల వరకూ సాగింది. గొడవ తీవ్రం అవుతుండటంతో కొందరు స్థానికులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బాంద్రాలోని ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఈ గొడవ జరిగింది. విష్ణున ఖేడికేర్, వికాస్ గైక్వాడ్ లుగా తెలిసింది. 

పోలీసుల మధ్యనే గొడవ జరగడంతో వివరాలు బయటకు వెల్లడించలేదు. ఆగష్టులోనూ ఇటువంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్ రాజ్ లో జరిగింది. ఈ ఘటనలను నెటిజన్లు ట్రోల్ చేస్తుండటంతో వైరల్ గా మారుతున్నాయి.