India-China : భారత్, చైనా సైనికాధికారుల కోర్ కమాండర్ స్థాయి చర్చలు
నేడు భారత్, చైనా సైనికాధికారుల 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. తూర్పు లద్దాక్ సరిహద్దుల్లో ప్రతిష్ఠంభన, బలగాల ఉపసంహరణపై చర్చలు జరుగనున్నాయి.
- bheemraj
- Published On : October 10, 2021 / 09:29 AM IST
India China
Core commander level talks : నేడు భారత్, చైనా సైనికాధికారుల 13వ విడత కోర్ కమాండర్ స్థాయి చర్చలు జరుగనున్నాయి. తూర్పు లద్దాక్ సరిహద్దుల్లో ప్రతిష్ఠంభన, బలగాల ఉపసంహరణపై చర్చలు జరుగనున్నాయి. చైనా భూ భాగం మోల్డో వద్ద ఉదయం 10.30 సమావేశం ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో హాట్ స్ప్రింగ్స్, గోగ్రా హైట్స్ నుంచి బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల సైనిక అధికారులు చర్చించనున్నారు.
భారత్ తరపున లేహ్‌లోని 14 కార్ప్స్ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ పీజీకే మీనన్ చర్చల బృందానికి నేతృత్వం వహించనున్నారు. వాస్తవాధీన రేఖ వెంబడి ప్రతిష్టంభనను సత్వరమే పరిష్కరించుకోవాలని భారత సైన్యం భావిస్తోంది. దెస్పంగ్, దెమ్చోక్ ప్రాంతాల్లోనూ ప్రతిష్టంభనకు తెరదించాలని భారత్ భావిస్తోంది. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ వద్ద చైనా సైన్యం చొరబాటు ఘటనలు వెలుగు చూసిన నేపథ్యంలో తాజా సైనిక చర్చలకు ప్రాధాన్యత సంతరించుకుంది.
WhatsApp: వాట్సప్ ప్రొఫైల్ పిక్ కనిపించకుండా హైడింగ్ ఆప్షన్
అరుణాచల్ ప్రదేశ్ తవాంగ్ సెక్టార్‌లోని యాంగ్ట్సే ప్రాంతం, ఉత్తరాఖండ్‌లో వాస్తవాధీన రేఖ వెంబడి ఉన్న బారాహోటి సెక్టార్, తూర్పు లద్దాఖ్ ప్రాంతాల్లో చైనా పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తూర్పు లడ్డాక్ లో సరిహద్దు వివాదం తలెత్తిన నాటి నుంచి ఇప్పటివరకు కమాండర్ స్థాయి అధికారులు 12 సార్లు చర్చలు జరిపారు.
