వాయు కాలుష్యంతో భారత్‌లో సెకన్‌కు రూ.3.39 లక్షల్లో నష్టం!

  • Publish Date - February 13, 2020 / 12:37 PM IST

ఆర్థికంగా నష్టపోయిన భారత్: 2018లో సెంటర్‌ ఫర్‌ రిసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (CREA) ఇచ్చిన ఆధారాలతో ఆగ్నేయాసియా గ్రీన్‌ పీస్‌ సంస్థ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం శిలాజ ఇంధనాల వల్ల కలిగే వాయు కాలుష్యంతో భారత్‌ కు జరుగుతున్న నష్టం దేశ GDPలో 5.4 శాతం అని తెలిసింది. సెకనుకు రూ .3.39 లక్షల నష్టానికి దారితీసింది. చైనా, అమెరికా తరువాత వాయు కాలుష్యం కారణంగా భారత్ ఆర్థికంగా మూడవ అత్యధికంగా నష్టాల పాలైంది. 

లక్షల్లో మరణాలు: వాయు కాలుష్యం వల్ల గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, ఆస్తమా వంటి రోగాల ముప్పు మరింత పెరుగుతున్నది. దీంతో లక్షల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మునుపటి అధ్యయనం ప్రకారం.. 2017 లో భారతదేశం నిమిషానికి 4 మందిని కోల్పోయింది.ఈ సంవత్సరంలో 2.3 మిలియన్ల మరణాలు, ఇది ప్రపంచంలోనే అత్యధికం. CREA గ్రీన్‌ పీస్‌ సంస్థ నివేదిక ప్రకారం 2018 లో వాయు కాలుష్యం కారణంగా మరణించిన వారి సంఖ్య 4.5 మిలియన్లకు చేరుకుంది… అంటే వాయు కాలుష్యం కారణంగా ప్రతి రెండు నిమిషాలకు 17 మంది మరణించారు. 

భారత్ లో కలిషిత నీరు తాగడం వల్ల సంవత్సరానికి సుమారు 1.8లక్షల మంది  మరణిస్తున్నారు. అంతేకాదు కార్మికులు అనారోగ్యం కారణంగా పనులకు హాజరు కావడంతో ఏటా 49 కోట్ల దినాలను కోల్పోతున్నాం. ప్రభుత్వం ఆరోగ్య రంగంపై GDPలో 3.3శాతం ఖర్చు చేస్తుంది.