Viral Video Representative Image (Image Credit To Original Source)
Viral Video: పంజాబ్ లోని తర్న్ తరన్ లో ఓ పెళ్లి వేడుకలో జరిగిన ఘటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పెళ్లి వేడుకలో వధువుపై నోట్ల వర్షం కురిపించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే, ఈ వ్యవహారం వివాదానికి దారితీసింది. మొత్తం 8.5 కోట్ల నగదును వెల్లజల్లారని ప్రచారం జరిగింది. అందులో నిజం లేదని కుటుంబసభ్యులు అంటున్నారు. 4 లక్షల రూపాయల విలువైన 10 రూపాయల నోట్లు, డాలర్లు మాత్రమే వాడారని కుటుంబసభ్యులు వివరణ ఇచ్చారు.
ఫిబ్రవరి 14న తరన్ తారన్ లో ఓ పెళ్లి జరిగింది. ఈ వివాహ వేడుకలో వరుడి కుటుంబం వధువుకు రూ.8.5 కోట్ల నగదు ఇచ్చారనే ప్రచారం జరిగింది. అయితే అందులో నిజం లేదని వధువు కుటుంబం స్పష్టం చేసింది. వధువు వేదిక వద్ద నిలబడి ఉండగా ఆమెపై కరెన్సీ నోట్ల వర్షం కురిపించారు. పంజాబీ వివాహాలలో ఇదొక ఆచారం. ఇక, అతిథులు సంగీతానికి అనుగుణంగా నృత్యం చేయడం కూడా వీడియోలో కనిపిస్తుంది. మరికొందరు డబ్బును గాల్లోకి విసురుతున్నారు.
వధువుపై నోట్ల కట్టలు కురిపించిన వైనం తీవ్ర విమర్శలకు దారితీసింది. డబ్బును ఇలా దుర్వినియోగడం చేయడం కరెక్ట్ కాదంటున్నారు. అంతేకాదు 8.5 కోట్ల రూపాయల విలువైన కరెన్సీని పెళ్లి కూతురిపై చల్లారనే ప్రచారం సోషల్ మీడియాలో మరింత హీట్ పెంచింది. దీనిపై వరుడి కుటుంబసభ్యులు స్పందించారు. వేడుక సందర్భంగా వధువుపై నిజంగానే డబ్బు వర్షం కురిపించినప్పటికీ, ఆన్‌లైన్‌లో చలామణి అవుతున్న గణాంకాలకు ఆ మొత్తం ఏమాత్రం దరిదాపుల్లో లేదన్నారు. 8.5 కోట్ల నగదు గాల్లోకి చల్లారు అనే ప్రచారంలో నిజం లేదన్నారు.
”నా సోదరుడు ఆస్ట్రేలియాలో ట్రక్ వ్యాపారం నిర్వహిస్తున్నాడు. వివాహం ఫిబ్రవరి 14న జరిగింది. మేము డబ్బులు కురిపించి సంబరాలు చేసుకున్నాము. కానీ అది దాదాపు రూ.2 లక్షలే. సోషల్ మీడియాలో 8.5 కోట్లు అని అనటం కరెక్ట్ కాదు” అని వరుడి సోదరుడు సికందర్ సింగ్ వివరణ ఇచ్చాడు.
ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన ఈవెంట్ మేనేజర్, DJ కూడా వైరల్ అయిన రూ.8.5 కోట్ల వాదనను తోసిపుచ్చారు. ”మెత్తం నగదు 4 లక్షల రూపాయలే, అందులో కొన్ని డాలర్ నోట్లు కూడా ఉన్నాయి. మరి కోటి రూపాయల సంఖ్య ఎలా బయటకు వచ్చిందో, ఎలా వైరల్ అయ్యిందో మాకు కూడా కచ్చితంగా తెలియదు. చాలా విడ్డూరంగా ఉంది” అని ఈవెంట్ మేనేజర్ వివరించారు.
వరుడు, వధువు కుటుంబసభ్యులు క్లారిటీ ఇచ్చినా.. ఇంకా డబ్బు గురించి ప్రచారం మాత్రం ఆగడం లేదు. వీడియో తెగ వైరల్ గా మారింది. డబ్బును ఇలా చల్లడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు. ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బును ఇలా గాల్లోకి చల్లి సభ్య సమాజానికి ఏం మేసేజ్ ఇద్దామని కొందరు నెటిజన్లు మండిపడుతున్నారు. ఎంత డబ్బునోళ్లు అయినా.. ఇలా బలుపు చూపించడం కరెక్ట్ కాదని హితవు పలికారు.
A video from a lavish Punjabi wedding in Patti town of Punjab’s Tarn Taran has gone viral.
The ceremony, held on February 14, shows guests showering bundles of currency notes over the bride and groom as they stand on the wedding stage.
Several attendees, including NRI guests… pic.twitter.com/p7PuwnWW4G
— Vani Mehrotra (@vani_mehrotra) February 18, 2026
Also Read: బంగారం కొనేవారికి భారీ గుడ్‌న్యూస్.. అమెరికా దెబ్బతో ధర ఢమాల్.. తులం రేటు ఎంతంటే?