Abhijit Dipke Arrest: సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కే అరెస్ట్.. ఢిల్లీలో తీవ్ర ఉద్రిక్తత!
ఢిల్లీలో 'లెహ్రా దో తిరంగా' ర్యాలీకి ముందు సీజేపీ కన్వీనర్ అభిజిత్ దీప్కేను(Abhijit Dipke Arrest) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
- V Santhosh Kumar
- Published on- October 16, 2026 / 05:43 PM IST
Delhi police detain cjp founder abhijeet dipke ahead of lehra do tiranga rally
Abhijit Dipke Arrest: కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) కన్వీనర్ అభిజిత్ దీప్కేను ఢిల్లీ పోలీసులు శుక్రవారం ఆయన నివాసంలో ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. పార్టీ పిలుపునిచ్చిన ‘లెహ్రా దో తిరంగా’ జాతీయ జెండా ర్యాలీకి బయలుదేరడానికి కొద్ది నిమిషాల ముందే పోలీసులు ఈ చర్య చేపట్టారు. తాను ఏ తప్పు చేశానని అరెస్ట్ చేస్తున్నారని దీప్కే ప్రశ్నించగా, రాజధానిలో శాంతిభద్రతలను పరిరక్షించేందుకే ముందస్తుగా అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు.
Sabarimala: శబరిమల యాత్రకు సిద్ధమవుతున్న కేరళ.. డ్రోన్స్ తో ప్రత్యేక నిఘా.. కలెక్టర్ కీలక ఆదేశాలు!
వారం వ్యవధిలో రెండోసారి పోలీసుల చర్య:
వారం వ్యవధిలో అభిజిత్ దీప్కే(Abhijit Dipke Arrest)ను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఇది రెండోసారి కావడం గమనార్హం. ఇటీవల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో ఓటర్ల పేర్లను నిబంధనలకు విరుద్ధంగా తొలగించారంటూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు బయలుదేరినప్పుడు విమానంలోనే ఆయనను అరెస్ట్ చేశారు.
కనాట్ ప్లేస్లో నిషేధాజ్ఞలు.. మున్సిపల్ కౌన్సిల్ అనుమతి నిరాకరణ:
అక్టోబర్ 16న ఢిల్లీలోని కన్నాట్ప్లేస్ కేంద్రంగా ఈ తిరంగా ర్యాలీ నిర్వహించాలని సీజేపీ ప్రణాళిక రచించింది. అయితే, ఆ ప్రాంతంలో భారతీయ న్యాయ సంహిత (BNS) సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని, ఈ మార్చ్కు న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ (NDMC) ఎటువంటి అనుమతి ఇవ్వలేదని పేర్కొంటూ పోలీసులు ముందే నోటీసులు అందజేశారు. ఆంక్షలను ఉల్లంఘించి ర్యాలీ నిర్వహించడం చట్టవిరుద్ధమని హెచ్చరించిన పోలీసులు, ముందస్తుగా దీప్కేను స్టేషన్కు తరలించారు.
