ధోనీగారి కుక్కా?: వికెట్ కీపర్‌గా కుక్క ఫీల్డింగ్ అదుర్స్..
- veegam team
- Published On : February 22, 2020 / 06:41 AM IST
ఇద్దరు చిన్నారులతో కలిసి ఓ కుక్క క్రికెట్ ఆడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇద్దరు పిల్లలు ఒకరు బౌలింగ్ చేస్తుంటే మరొకరు బ్యాటింగ్ చేస్తున్నారు. వీరికి తోడు ఓ కుక్క కూడా క్రికెట్ ఆటలో ఉత్సాహంగా పొల్గొంది. చక్కగా వికెట్ కీపర్ గా పనిచేసింది. ఫీల్డింగ్ కూడా చేసేస్తోంది. ఓ పిల్లాడు వేసిన బౌలింగ్ కు తన బ్యాట్ తో కొట్టిన బాల్ దూరంగా వెళ్లి పడింది. ఆ బాల్ ను వెతికి పిల్లాడికి ఇచ్చేసి తిరిగి వచ్చి వికెట్ కీపర్ గా అలెర్ట్ అయి నిలబడి బంతి కదలికల్ని చురుగ్గా గమనిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
కుక్కలకు మనుషులకు మధ్య స్నేహం ఈనాటిది కాదు. మనుషు భావాల్ని కుక్కలు చక్కగా అర్థం చేసుకుంటాయి. తమపై కొంచెం ప్రేమ చూపిస్తే చాలు తమ ప్రాణాల్ని కూడా అడ్డువేసి యజమానుల ప్రాణాల్ని కాపాడతాయి. అటువంటి కుక్క మనుషులకు చాలా చాలా విశ్వాసమైన జంతువుగా మారిపోయింది. మనుషులకు కుక్కలు చక్కటి స్నేహ హస్తాన్ని అందిస్తాయి.
అటువంటిదే ఈ ఇద్దరు పిల్లలు కుక్క కలిసి ఆడిన క్రికెట్ గేమ్. ప్రముఖ నటి..టాక్ షో హోస్ట్ సిమి గరేవాల్ ఈ వీడియోను గురువారం ఫిబ్రవరి 20,2020న షేర్ చేశారు. ఈ వీడియోకు నెటిజన్ల నుంచి చక్కటి రెస్పాన్స్ వచ్చింది. ఈ కుక్క భారత క్రికెట్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని పెంపుడు కుక్క అయి ఉంటుందని కామెంట్స్ పెడుతున్నారు.
An award for the Best Fielder of the Year!!?? pic.twitter.com/7PWBLBgnnV
— Simi Garewal (@Simi_Garewal) February 20, 2020
Read More>>నిప్పులగుండంలో పడిపోయిన భక్తులు..పరిస్థితి విషమం: శివరాత్రి వేడుకల్లో అపశృతి
