Delhi Earthquake: ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లో భారీ భూకంపం.. అర్ధరాత్రి 30 సెకన్ల పాటు తీవ్ర ప్రకంపనలు.. రోడ్లపైకి పరుగులు తీసిన జనం

దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం (Delhi Earthquake)తీవ్ర కలకలం సృష్టించింది.

Earthquake of 4.9 magnitude hits delhi ncr north india tremors felt

Delhi Earthquake: దేశ రాజధాని ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో భూకంపం తీవ్ర కలకలం సృష్టించింది. రాత్రి 10:23 గంటల సమయంలో ఒక్కసారిగా భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్, గురుగ్రామ్‌లతో కూడిన ఎన్‌సీఆర్ పరిధిలో సుమారు 30 సెకన్ల పాటు బలంగా ప్రకంపనలు(Delhi Earthquake) కొనసాగాయి. దీంతో బహుళ అంతస్తుల భవనాలు, అపార్ట్‌మెంట్లలో నివసించే జనం భయంతో మెట్ల గుండా కిందకు దిగి ఖాళీ ప్రదేశాలు, రోడ్లపైకి పరుగులు తీశారు. రిక్టర్ స్కేలుపై ఈ భూకంప తీవ్రత 4.9గా నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ స్పష్టం చేసింది.

IAF Chief Ashutosh Dixit: భారత వైమానిక దళానికి కొత్త చీఫ్.. అశుతోష్‌ దీక్షిత్‌ను నియమించిన కేంద్రం.. రక్షణ శాఖ అధికారిక ప్రకటన

ఉత్తరాఖండ్, హిమాచల్‌లోనూ ప్రకంపనలు.. ప్రాణనష్టం లేకపోవడంతో ఊపిరి:

ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీ ప్రాంతంలో కూడా 4.4 తీవ్రతతో మరో ప్రకంపన నమోదైంది. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూమి కంపించింది. ఎత్తైన హౌసింగ్ సొసైటీలలో ఫ్యాన్లు, లైట్లు ఊగిపోవడంతో జనం ఆందోళన చెందారు. అటు ఆఫ్ఘనిస్తాన్ కేంద్రంగా సంభవించిన 6.1 తీవ్రత భూకంప ప్రభావం కూడా సరిహద్దు ప్రాంతాలపై కనిపించింది. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకపోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు.

సీస్మిక్ జోన్-4లో ఢిల్లీ.. భూకంపాలకు అసలు కారణం ఇదే:

ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతం భౌగోళికంగా భూకంప ప్రమాదం ఎక్కువగా ఉండే అత్యంత సున్నితమైన సీస్మిక్ జోన్-4 పరిధిలోకి వస్తుంది. హిమాలయ పర్వత శ్రేణులకు సమీపంలో ఉండటంతో ఇక్కడ తరచూ ప్రకంపనలు నమోదవుతుంటాయి. భూమి లోపలి పొరల్లో ఉండే ఏడు ప్రధాన టెక్టోనిక్ ఫలకాలు నిరంతరం కదులుతూ ఒకదానితో ఒకటి ఢీకొన్నప్పుడు అపారమైన శక్తి తరంగాల రూపంలో పైకి దూసుకువస్తుంది. అదే మనకు భూకంప ప్రకంపనలుగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు వెల్లడించారు.