Enjoys Eating : మొక్కజొన్న పొత్తుల్ని తొక్క తీసి మరీ తింటున్న ఏనుగు
ఓ ఏనుగు మొక్కజొన్న కండెల్ని తినే విధానం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కండెల్ని తొక్క తీసి తింటున్న ఏనుగు వీడియోకు నెటిజన్లు ఫిదా అయిపోయారు.
- nagamani
- Published On : July 23, 2021 / 02:55 PM IST
Elephant Enjoys Eating
Elephant enjoys eating maize : ఏనుగుకి చెరుకు గడలంటే ఎంతిష్టమో..ఓ ఏనుగు ముందు మోపులు మోపులు చెరుగు గడలు పెడితే క్షణాల్లో లాగించేస్తుంది. అంత ఇష్టం ఏనుగుకు అవంటే. అలాగే వెలగ పండ్లను కూడా భలే గుటుక్కు గుటుక్కుమనిపిస్తుంది. మొక్కజొన్నపొత్తులంటే కూడా చాలా ఇష్టం ఏనుగులకు. గడ్డి, ఆకులు, చెట్ల కొమ్మలతో పాటు రకాల మొక్కల్ని..గెలల కొద్దీ అరటిపండ్లు లాగించేస్తాయి ఏనుగులు.
అంతేనా..ఇంకా చాలానే తింటుంది. ఎందుకంటే ఏనుగంటే భారీ ఆకారం..దానికి తగినట్లుగా తినాలి కదా మరి. కానీ ఏనుగు ఏది తిన్నా డైరెక్టుగానే తినేస్తుంది. అరటి పండ్లు తింటే తొక్క ఒలిచి తినదు కదా మనలాగా.. కానీ ఓ ఏనుగు మాత్రం అరటి పండ్లను కాదు గానీ..మొక్కజొన్న పొత్తుల్ని తినే విధానం మాత్రం భలే చూడముచ్చటగా ఉంది.
సాధారణంగా ఏనుగు చెరుకు గడలు తిన్నా..అరటి పండ్లు తిన్నా గానీ డైరెక్టుగానే తినేస్తుంది. తొక్కలతో సహా..కానీ మరి ఓ ఏనుగు మాత్రం మరి దానికి శుభ్రత ఎక్కువో లేదా..కాస్త నీట్ గా తినాలని అనికుందో గానీ మొక్కజొన్న కండెల్ని తొక్క తీసి తొక్కతో పాటు ముచ్చిక కూడా తీసి మరీ తింటోంది. అలా మొక్కజొన్న కండెని కాలితో తొక్కి పట్టి పైన ఉండే దాని తొక్కలు అంటే రేకులు రేకులుగా ఉండే వాటిని తీసి నీట్ గా నోట్లో పెట్టుకుని గుటుక్కుమనిపిస్తోంది.
అలా తినేటప్పుడు ఓ కండెను తొక్క తీసి నోట్లో పెట్టుకుంటుండగా దానితో పాటు దాని ముచ్చిక కూడా ఉంది. కానీ నీట్ నెస్ లో ఏమాత్రం కాంప్రమైజ్ కానీ ఈ ఏనుగు ఆ ముచ్చికను కూడా విరిగి పడేసి ఓన్లీ కండెను మాత్రం తింది. అలా ఈ ఏనుగు మొక్కజొన్న కండెల్ని తినే తీరు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి మీరు కూడా ఓ లుక్ వేయండీ ఐఎఫ్ఎస్ ఆఫీసర్ సుదా రామెన్ షేక్ చేసిన ఈ ఏనుగు నీట్ అండ్ క్లీన్ ఈటింగ్ వీడియోపై…
Maize is one of their favourite foods #elephantspic.twitter.com/9uJA19tlZA
— Sudha Ramen IFS ?? (@SudhaRamenIFS) July 21, 2021
