PM Modi : దేశీయ కంపెనీల్లోకి రికార్డు స్థాయిలో పెట్టుబడులు..ఇప్పుడంతా మేడిన్ ఇండియా గురించే చర్చ
శుక్రవారం జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతదేశంలో మరియు విదేశాలలోని నిపుణులు..భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి
- venkaiahnaidu
- Published On : October 22, 2021 / 10:28 AM IST
Modi (2)
PM Modi శుక్రవారం జాతినుద్దేశించిన చేసిన ప్రసంగంలో భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి ప్రధాని మోదీ ప్రస్తావించారు. భారతదేశంలో మరియు విదేశాలలోని నిపుణులు..భారతదేశ ఆర్థిక వ్యవస్థ గురించి చాలా సానుకూలంగా ఉన్నారన్నారు.
ప్రస్తుతం భారతీయ కంపెనీలకు రికార్డు స్థాయిలో పెట్టుబడులు రావడం మాత్రమే కాదు, యువతకు కొత్త ఉపాధి అవకాశాలు కూడా సృష్టించబడుతున్నాయన్నారు.మనం ఎక్కడ చూసినా ఇప్పుడు ఆశావాదం మాత్రమే ఉంది …ఇంతకు ముందు ఈ దేశంలో, ఆ దేశంలో అంటూ భజనలు మాత్రమే వినిపించేవి. కానీ నేడు అందరూ ‘మేడ్ ఇన్ ఇండియా’ గురించి మాట్లాడుతున్నారని మోదీ అన్నారు.
