Bharat Jodo Yatra: భారత్ జోడో యాత్రలో పాల్గొన్న ఫారూఖ్ అబ్దుల్లా.. రాహుల్‌తో కలిసి నడక
రాహుల్ చేపట్టిన ఈ యాత్ర మొత్తానికి 3,000 కిలోమీటర్ల మైలు రాయిని ఈరోజే చేరుకుంది. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టడంతోనే ఈ ఘనత సాధించారు రాహుల్. భారత్ జోడో యాత్ర మొదటి విడతగా చెప్తున్న ప్రస్తుత యాత్ర దాదాపు ముగింపుకు వచ్చినట్టే కనిపిస్తోంది. జమ్మూ కశ్మీర్లో సాగే పర్యటన వివరాలు సైతం మంగళవారం విడుదలయ్యాయి. ఇక రెండవ విడత గురించిన వివరాలు ఇది ముగియగానే విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
- tony bekkal
- Published On : January 3, 2023 / 06:52 PM IST
Farooq Abdullah joins Rahul Gandhi's Bharat Jodo Yatra
Bharat Jodo Yatra: రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ ఫారూఖ్ అబ్దుల్లా పాల్గొన్నారు. మంగళవారం ఈ యాత్ర ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించిన సందర్భంలోనే ఫారూఖ్ పాల్గొనడం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా, ఈ యాత్రలో కొంత దూరం పాటు రాహుల్‌తో ఫారూఖ్ కలిసి నడిచారు. యాత్రలోకి ప్రవేశించగానే కౌగిళించుకుని స్వాగతం పలికారు రాహుల్. ప్రియాంక గాంధీ వాద్రా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ సహా పలువురు విపక్ష నేతలు భారత్ జోడో యాత్రకు సంఘీభావం పలుకుతున్నారు. వాస్తవానికి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో సాగే యాత్రలో పాల్గొనాల్సిందిగా బీఎస్పీ సుప్రెమో మాయావతి, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌లకు రాహుల్ లేఖ ద్వారా ఆహ్వానం పంపినప్పటికీ, వారు సముఖంగా స్పందించలేదు.
यही प्यार और आशीर्वाद लिए अपने लक्ष्य तक जाएंगे…देश जोड़ने निकले हैं, देश जोड़कर दिखाएंगे।
आज #BharatJodoYatra में शामिल हुए जम्मू-कश्मीर के पूर्व मुख्यमंत्री फारूक अब्दुल्ला जी। pic.twitter.com/tchUjKq360
— Congress (@INCIndia) January 3, 2023
Supreme Court: సినిమా హాళ్లకు బయటి ఫుడ్ తీసుకెళ్లొచ్చా.. సుప్రీం కోర్టు తీర్పు ఇదే!
ఇక రాహుల్ చేపట్టిన ఈ యాత్ర మొత్తానికి 3,000 కిలోమీటర్ల మైలు రాయిని ఈరోజే చేరుకుంది. దేశంలో కీలకమైన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోకి అడుగు పెట్టడంతోనే ఈ ఘనత సాధించారు రాహుల్. భారత్ జోడో యాత్ర మొదటి విడతగా చెప్తున్న ప్రస్తుత యాత్ర దాదాపు ముగింపుకు వచ్చినట్టే కనిపిస్తోంది. జమ్మూ కశ్మీర్లో సాగే పర్యటన వివరాలు సైతం మంగళవారం విడుదలయ్యాయి. ఇక రెండవ విడత గురించిన వివరాలు ఇది ముగియగానే విడుదల చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి.
Karnataka: ఎన్నికలలోపు మాజీ సీఎం జైలుకు వెళ్తారంటూ హెచ్చరించిన బీజేపీ చీఫ్
