FCRA: రాజీవ్ గాంధీ ఫౌండేషన్ విదేశీ విరాళాల లైసెన్స్ రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం
1991లో ఏర్పాటైన ఈ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ట్రస్టీలుగా ఉన్నారు. ఈ సంస్థ వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, 2009 వరకు విద్య, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కృషి చేసింది. మహిళలు, బాలలు, వికలాంగుల సంక్షేమం కోసం పని చేసింది.
- tony bekkal
- Updated on- October 23, 2022 / 04:50 PM IST
Foreign Funding Licence Of Gandhis' NGOs Cancelled
FCRA: రాజీవ్ గాంధీ ఫౌండేషన్‌కు కేంద్ర ప్రభుత్వం శనివారం షాక్ ఇచ్చింది. విదేశీ విరాళాల నియంత్రణ చట్టం అనుమతిని రద్దు చేసింది. ఈ విదేశీ నిధుల చట్టాన్ని ఉల్లంఘించినందుకు ఈ చర్య తీసుకున్నట్లు ప్రకటించింది. ఇది గాంధీ కుటుంబం నిర్వహిస్తున్న ప్రభుత్వేతర సంస్థ. రాజీవ్ గాంధీ ఫౌండేషన్ నిర్వహణపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ 2020 జూలైలో ఓ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ సంస్థకు గతంలో ఇచ్చిన ఎఫ్‌సీఆర్ఏ అనుమతిని ఈ కమిటీ నివేదిక ఆధారంగా రద్దు చేసింది. ఈ సమాచారాన్ని ఈ ఫౌండేషన్ ఆఫీస్ బేరర్లకు తెలియజేసింది.
1991లో ఏర్పాటైన ఈ ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ వ్యవహరిస్తున్నారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్, మాజీ కేంద్ర మంత్రి పి చిదంబరం, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా ట్రస్టీలుగా ఉన్నారు. ఈ సంస్థ వెబ్‌సైట్‌లో తెలిపిన వివరాల ప్రకారం, 2009 వరకు విద్య, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ రంగాల్లో కృషి చేసింది. మహిళలు, బాలలు, వికలాంగుల సంక్షేమం కోసం పని చేసింది.
2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. భాజపా అధ్యక్షుడు జె.పి.నడ్డా ఆ సమయంలో ఆర్‌జీఎఫ్‌పై పలు ఆరోపణలు చేశారు. దేశ ప్రయోజనాలకు భంగం కలిగించే కొన్ని అధ్యయనాలు చేపట్టడానికి 2005- 2009 మధ్య ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందాయని ఆరోపించారు. ప్రస్తుతం పరారీలో ఉన్న ఆర్థిక నేరస్థుడు మెహుల్ ఛోక్సీ వంటి వారి నుంచి అప్పట్లో ప్రధానమంత్రి రిలీఫ్ ఫండ్‌కు నిధులు అందాయని.. వాటిని ఆర్‌జీఎఫ్‌కు మళ్లించారన్నారు. ఆర్‌జీఎఫ్ వైబ్‌సైట్‌లోని 2005- 06 వార్షిక నివేదిక ప్రకారం.. ఆర్‌జీఎఫ్‌కు నిధులు అందించిన దేశాల జాబితాలో చైనా కూడా ఉంది.
Video: దొంగ అనే ఆరోపణతో దళిత యువకుడిని కొట్టి, గుండు చేసి, రంగు పూసి చిత్రవధ చేశారు.