Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎంను కలిసిన రెజ్లర్ గ్రేట్ ఖలీ.. ఆప్ గురించి చర్చలు
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ మాజీ స్టార్ దలీప్ సింగ్ రానా (ఖలీ)ని కలిశారు. ఈ సందర్భంగా AAPచేస్తున్న సేవలను కొనియాడిన ఖలీ....
- Subhan Ali Shaik
- Updated on- November 19, 2021 / 07:34 AM IST
Delhi Cm
Delhi CM Kejriwal: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ గురువారం వరల్డ్ రెజ్లింగ్ ఎంటర్‌టైన్మెంట్ మాజీ స్టార్ దలీప్ సింగ్ రానా (ఖలీ)ని కలిశారు. ఈ సందర్భంగా AAPచేస్తున్న సేవలను కొనియాడిన ఖలీ.. భవిష్యత్ లో ఆప్ ప్రభుత్వానికి తన సపోర్ట్ తెలియజేస్తానని వెల్లడించారు. ఢిల్లీ ఎమ్మెల్యే జర్నైల్ సింగ్ తో కలిసి సీఎం నివాసానికి వెళ్లి కలుసుకున్నారు.
‘ఇవాళ గ్రేట్ ఖలీని కలిశాను. ప్రపంచ స్థాయిలో ఇండియా రెజ్లింగ్ ను ఫ్యామస్ చేసిన వ్యక్తిని కలవడం చాలా సంతోషంగా ఉంది. ఢిల్లీలో ఎలక్ట్రిసిటీ, వాటర్, స్కూల్, హాస్పిటల్ సేవల తీరును కొనియాడాడు’ అని కేజ్రీవాల్ తన ట్విట్టర్ లో పంజాబీ భాషలో రాసుకొచ్చారు.
ప్రభుత్వం అధికారిక విడుదల చేసిన స్టేట్మెంట్ లో.. ఖలీ సీఎం దగ్గరకు వెళ్లి ఢిల్లీ డెవలప్మెంట్ పట్ల తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. ‘దేశ రాజధానిలో జరిగిన పనులు చూసి గర్వంగా ఫీలయ్యారు. కేజ్రీవాల్ ప్రభుత్వానికి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నానని అన్నారు. సొసైటీ కోసం సాధ్యమైనంత వరకూ తానూ చేయందిస్తానని అన్నారు’ అని ప్రభుత్వం ఇచ్చిన స్టేట్మెంట్ లో తెలిపింది.
………………………………….: ఓటీటీలో వచ్చేసిన మరో రెండు సినిమాలు..!
ਪੂਰੀ ਦੁਨੀਆ 'ਚ ਭਾਰਤ ਦਾ ਨਾਂ ਰੌਸ਼ਨ ਕਰਨ ਵਾਲੇ ਰੈਸਲਰ 'ਦ ਗ੍ਰੇਟ ਖ਼ਲੀ' ਜੀ ਨਾਲ ਅੱਜ ਮੁਲਾਕਾਤ ਹੋਈ। ਦਿੱਲੀ ਵਿੱਚ ਬਿਜਲੀ-ਪਾਣੀ, ਸਕੂਲ-ਹਸਪਤਾਲ ਵਿੱਚ ਕੀਤੇ ਕੰਮ ਉਹਨਾਂ ਨੂੰ ਬਹੁਤ ਪਸੰਦ ਆਏ। ਹੁਣ ਇਹ ਸਭ ਕੰਮ ਪੰਜਾਬ ਵਿੱਚ ਵੀ ਕਰਨੇ ਨੇ, ਅਸੀਂ ਸਾਰੇ ਮਿਲ ਕੇ ਪੰਜਾਬ ਨੂੰ ਬਦਲਾਂਗੇ। pic.twitter.com/nxf9EsW5ZL
— Arvind Kejriwal (@ArvindKejriwal) November 18, 2021
