FSSAI: ‘హెల్తీ’ పేరుతో మోసం? FSSAI కఠిన చర్యలతో ఫుడ్ కంపెనీలకు షాక్.. 8 కంపెనీలకు నోటీసులు

ఈ నేపద్యంలోనే భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ(FSSAI) తాజాగా ఎనిమిది ఫుడ్ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది.

FSSAI action on misleading health claims in packaged food brands India latest update+

  • FSSAI చర్యలు 8 కంపెనీలు
  • హెల్తీ లేబుళ్లపై నోటీసులు జారీ
  • తప్పుదారి మార్కెటింగ్‌పై నియంత్రణ

FSSAI: ప్రస్తుత కాలంలో ప్రాకేజ్డ్ ఫుడ్ ఎక్కువగా వాడకంలో వచ్చింది. సూపర్‌ మార్కెట్‌స్, మార్ట్ లు ఎక్కడ చూసినా ఆమె దర్శనం ఇస్తున్నాయి. అందుకే, ప్రముఖ కంపెనీలు కూడా దానికి తగ్గట్టుగా ప్రతి ప్యాకెట్ పైన హెల్తీ, వెగన్, జీరో మైదా అంటూ పెద్ద పెద్ద కొటేషన్స్ రాస్తూ మార్కెట్ చేస్తున్నారు. ఇవి చూసి చాలా మంది వినియోగదారులు “ఇది మంచి ఫుడ్ కదా” అని నమ్మి కొనడం చేస్తున్నారు. కానీ, నిజంగా ఆ క్లెయిమ్స్ అన్నీ శాస్త్రీయంగా రుజువు అయ్యాయా అనేది ఎప్పటికీ ప్రశ్నే. ఇదే విషయాన్ని ఇప్పుడు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల ప్రాధికార సంస్థ (FSSAI) సీరియస్‌గా తీసుకుంది. ఈ న్యూస్ ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది.

ఎవరి మీద నోటీసులు, ఎందుకు ఇంత పెద్ద చర్య?

ఈ నేపద్యంలోనే FSSAI తాజాగా ఎనిమిది ఫుడ్ కంపెనీలకు నోటీసులు ఇచ్చింది. వాటిలో ఎమామి హెల్తీ & టేస్టీ, హెల్తీ ఎయిడ్, ట్రూవీ, ది హెల్త్ ఫ్యాక్టరీ, హెల్తీ మాస్టర్, హెల్తీ ఛాయస్, ప్లాన్ బీ, న్యూహెర్బ్స్ లాంటి పేర్లు ఉన్నాయి. వీళ్లు హెల్తీ, జీరో మైదా, ట్రూ విటమిన్స్, ప్లాంట్ బేస్డ్ వేగన్ వంటి పదాలను వాడి ఉత్పత్తులను మరింత ఆరోగ్యకరంగా చూపిస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. కానీ సమస్య ఏమిటంటే.. ఈ క్లెయిమ్స్‌కు సరైన ఆధారాలు లేకపోవడం.

వినియోగదారులను ఎలా తప్పుదారి పట్టిస్తోంది?

ఉదాహరణకి “జీరో మైదా బ్రేడ్” అని చెప్పినా అందులో ఇతర పదార్థాలు ఉండటం, “తట్రూ విటమిన్” అనే పేరు అసలు రెగ్యులేటెడ్ కేటగిరీ కాకపోవడం వంటి విషయాలు ఇప్పుడు ప్రశ్నలకు దారి తీస్తున్నాయి. అలాగే వేగన్ లేబుల్ వాడటానికి అవసరమైన అనుమతులు లేకపోవడం కూడా పెద్ద సమస్యగా మారింది. ఇలా ఆకర్షణీయమైన మాటలతో ఉత్పత్తులు అమ్మడం వల్ల కొనుగోలుదారులు నిజమైన న్యూట్రిషన్ గురించి క్లియర్‌గా అర్థం చేసుకోలేకపోతున్నారు.

ఇకపై మార్కెట్ ఎలా మారే అవకాశం ఉంది?

ఈ చర్యలతో ఫుడ్ కంపెనీల మార్కెటింగ్ స్ట్రాటజీపై పెద్ద ప్రభావం పడే అవకాశం ఉంది. ఇకపై “హెల్తీ” అనే మాట వాడాలంటే దానికి బలమైన శాస్త్రీయ ఆధారాలు చూపించాల్సి ఉంటుంది. వినియోగదారుల నమ్మకాన్ని కాపాడేందుకు FSSAI మరింత కఠిన నియమాలు తీసుకురావచ్చని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి “హెల్తీ ఫుడ్” అనే ట్యాగ్ ఇకపై అంత సింపుల్‌గా వాడే విషయం కాదని స్పష్టమవుతోంది. మరి ఈ నియమాల వల్ల సామాన్యులకు ఆరోగ్యకరమైన ఆహరం అందుతుందా అనేది చూడాలి.