Taxi Driver beaten by Girl:సిగ్నల్ వద్ద డ్రైవర్‌ను ఎగిరెగిరి కొట్టిన యువతి.. ట్రాఫిక్ పోలీసును కూడా
సిగ్నల్ వద్ద ఆకతాయిల తప్పుడు పనులు, తన్నులాట, వాగ్వాదాల్లాంటి చాలా చూశాం. కానీ, ఓ యువతి ట్రాఫిక్ పోలీసును కూడా పట్టించుకోకుండా ఓ క్యాబ్ డ్రైవర్ ను ఎగిరెగిరి కొడుతున్న వీడియో చూశారా..
- Subhan Ali Shaik
- Published On : August 2, 2021 / 09:57 AM IST
Taxi Driver
Taxi Driver beaten by Girl: సిగ్నల్ వద్ద ఆకతాయిల తప్పుడు పనులు, తన్నులాట, వాగ్వాదాల్లాంటి చాలా చూశాం. కానీ, ఓ యువతి ట్రాఫిక్ పోలీసును కూడా పట్టించుకోకుండా ఓ క్యాబ్ డ్రైవర్ ను ఎగిరెగిరి కొడుతున్న వీడియో చూశారా.. లక్నోలోని అవాధ్ క్రాసింగ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో యువతి ప్రవర్తన చూసి స్పాట్‌లో ఉన్న వారు ఆగమని చెప్తున్నా వినిపించుకోలేదు.
ఈ వీడియోను మేఘ్ అప్‌డేట్స్ షేర్ చేసింది. కార్ డ్రైవర్ ను యువతి కొడుతూనే ఉంది. కారణం అడగకుండానే అతని ఫోన్ కూడా పాడు చేసిందని పోస్టు పెట్టాడు. గొడవ ఆపడానికి వేరే వ్యక్తి రాగా అతణ్ని కూడా కొట్టి పక్కకు పంపించేసింది.
భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యే ప్రదేశంలో జిబ్రా క్రాసింగ్ వద్ద ఘటన జరగడంతో ట్రాఫిక్ పోలీసు ఇన్వాల్వ్ అయి ఆపేందుకు ప్రయత్నించినా పట్టించుకోలేదు. డ్రైవర్ ను ఎగిరెగిరి కొడుతూ.. ఫోన్ డ్యామేజ్ అవుతున్నా పట్టించుకోలేదు.
అక్కడే ఉన్న వారంతా విమర్శిస్తూ.. ప్రవర్తన కూడా తెలియదా అని ప్రశ్నించడమే సరిపోయింది. ఆ దారి గుండా పోయే మరో వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. డ్రైవర్ కాలర్ పట్టుకుని అటూఇటూ లాక్కెళ్లిందని పేర్కొంటూ ఎవరైనా మహిళా పోలీసులు ఈమెపై యాక్షన్ తీసుకోవాలని అందులో పేర్కొన్నాడు.
