Pralhad Joshi : షెడ్యూల్ ప్రకారమే పార్లమెంట్ సమావేశాలు
సాధారణ షెడ్యూల్ ప్రకారం జులై నెలలోనే పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు(Monsoon Session)జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు.
- venkaiahnaidu
- Published On : June 8, 2021 / 06:06 PM IST
Pralhad Joshi
Pralhad Joshi సాధారణ షెడ్యూల్ ప్రకారం జులై నెలలోనే పార్లమెంటు వర్షాకాలపు సమావేశాలు(Monsoon Session)జరుగుతాయని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా,కరోనా వ్యాప్తి మొదలైనప్పటి నుంచి పార్లమెంటు సెషన్స్ కుదించినట్లు పేర్కొన్న ప్రహ్లాద్ జోషి ..గతేడాది పార్లమెంటు శీతాకాలపు సమావేశాలు రద్దు చేసినట్లు గుర్తు చేశారు.
గతేడాది సాధారణంగా జులైలో ప్రారంభం కావాల్సిన వర్షాకాలం సమావేశాలు సెప్టెంబర్‌లో ప్రారంభమయ్యాయని,అయితే ఈసారి యథావిధిగా జరుగుతాయని మంగళవారం జోషి పేర్కొన్నారు. ఈ సమావేశాల నిర్వహణకు సంబంధించిన విధివిధానాలపై చర్చలు జరుగుతున్నాయని అధికార వర్గాలు తెలిపాయి
ఇక,కరోనా సమయంలో తమ తమ నియోజకవర్గాల్లో చేపట్టిన సహాయక చర్యల వివరాలు తెలియచేయాలని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఎంపీలను కోరారు. ఈ మేరకు ఎంపీలందరికీ లేఖ రాశారు. భవిష్యత్తులో ఇలాంటి విపత్కర పరిస్థితులను ఎదుర్కోవటానికి జాతీయ స్థాయిలో ఉత్తమ పద్ధతులను అభివృద్ధి చేయడానికి ఇది తోడ్పడుతుందని ఓం బిర్లా తెలిపారు.
