కాసేపట్లో పెళ్లి, పెళ్లి కొడుకు కోరిక..వధువు ఆత్మహత్య
ప్రేమించిన వాడు ఇలా చేస్తాడని ఊహించలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది.
- madhu
- Published On : March 11, 2021 / 06:04 PM IST
Groom refuses
Groom refuses : కాసేపట్లో పెళ్లి జరుగనుంది. ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడన్న ఆనందం..ఎప్పటిలాగానే ఉంటుందని అనుకున్నారు అమ్మాయి కుటుంబసభ్యులు. కానీ..పెళ్లి కొడుకు కోరిన కోరిక తీర్చలేకపోయారు వధువు తల్లిదండ్రులు. దీంతో పెళ్లి కాస్తా…ఆగిపోయింది. ప్రేమించిన వాడు ఇలా చేస్తాడని ఊహించలేక తీవ్ర మనస్థాపానికి గురైన ఆ యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. Sakri Jungle గ్రామంలో నివాసం ఉండే..Shama Jahan యువతి..స్థానికంగా ఉండే..Ateek లు ప్రేమించుకున్నారు.
వీరి ప్రేమను తెలుసుకున్న ఇరు కుటుంబసభ్యులు వివాహానికి అంగీకరించారు. అయితే అకస్మాత్తుగా…శనివారం తమకు మోటార్ సైకిల్ ఇస్తేనే వివాహం చేసుకుంటానని జహాన్ కుటుంబానికి అతీక్, అతని కుటుంబం చెప్పింది. జహాన్ చిన్న వయస్సులోనే ఉన్నప్పుడు తండ్రి కన్నుమూయడంతో…ఆమె తల్లి ఐదుగురు పిల్లలను పెంచి పోషించింది. ఢిల్లీలో జహాన్ సోదరులు పనిచేస్తున్నారు. వివాహానికి వారు ఆర్థికంగా సహకరిస్తున్నారు. బైక్ కొనివ్వలేని పరిస్థితిలో ఉన్నామని కుటుంబసభ్యులు చెప్పారు.
దీంతో సమస్యను పరిష్కరించడానికి గ్రామ పెద్దలు జోక్యం చేసుకున్నారు. అతిక్ పెట్టిన డిమాండ్ తో కలత చెందిన జహాన్..సోమవారం సీలింగ్ ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోయింది. మంగళవారం మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. వివాహం చేసుకోవడానికి వాళ్లు ఇష్టపడలేదని, జహాన్ వత్తిడి మేరకు అంగీకరించారని జహాన్ సోదరి వెల్లడించింది. వివాహం జరిగిన తర్వాత..డిమాండ్లు నెరవేర్చడానికి ప్రయత్నం చేస్తామని, అతను ఒప్పుకోలేదని జహాన్ కుటుంబసభ్యులు వెల్లడించారు. వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని బుడాన్ ఎస్ఎస్పీ సంకల్ప్ శర్మ వెల్లడించారు. పరారీలో ఉన్న అతిక్ కోసం గాలిస్తున్నట్లు తెలిపారు.
