Gujarat: 17ఏళ్ల టీనేజర్‌పై 23ఏళ్ల మహిళ అఘాయిత్యం
గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతన్న ఘటనలకు రివర్స్ గా.. మహిళే తనకంటే చిన్న వయస్సున్న టీనేజర్‌పై దారుణానికి..
- Subhan Ali Shaik
- Published On : August 16, 2021 / 09:58 PM IST
Woman Assaults 17 Year Boy
Gujarat: గుజరాత్‌లోని ఆనంద్ జిల్లాలో దారుణం జరిగింది. మహిళలపై అఘాయిత్యాలు జరుగుతన్న ఘటనలకు రివర్స్ గా.. మహిళే తనకంటే చిన్న వయస్సున్న టీనేజర్‌పై దారుణానికి పాల్పడింది. నిందితురాలిని పోలీసులు అరెస్టు చేశారు.
ఎలా జరిగిందంటే..
ఆనంద్ జిల్లాలో ఉండే 17ఏళ్ల టీనేజర్ కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెదకడం మొదలుపెట్టారు. ఆచూకీ తెలియకపోవడంతో పోలీసులను ఆశ్రయించి కంప్లైంట్ చేశారు. ఫిర్యాదు మేరకు ఎంక్వైరీ మొదలుపెట్టిన పోలీసులకు గుర్తు తెలియని వ్యక్తులు ఉన్నారంటూ సమాచారం వచ్చింది.
తర్వాతి రోజు రాత్రి సమయంలో టీనేజర్ ను సూరత్ నుంచి రెస్క్యూ చేయగలిగారు. అతనితో పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేసి సూరత్ కు తీసుకెళ్లినట్లు తెలిసింది. ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పొక్సో)చట్టం కింద ఆమెను అరెస్టు చేశారు.
ఇటువంటి ఘటనే మహారాష్ట్రలోనూ జరిగింది. మధ్యప్రదేశ్ లోని రాజ్ ఘఢ్ జిల్లాలో దారుణం జరిగిన 10రోజులకు వెలుగు చూసింది. అంతేకాకుండా రూ.1లక్ష ఇవ్వాలని లేదంటే 16ఏళ్ల కుర్రాడు తన భార్యను రేప్ చేసినట్లుగా ప్రచారం చేస్తామంటూ బెదిరించారు ఆ దంపతులు.
