Karnataka: నేను రౌడీని, కాపీ కొట్టి పాసయ్యాను, చీటింగులో నాకు పీహెచ్‭డీ ఉంది.. విద్యార్థులతో సమావేశంలో మంత్రి

ఇంతా చెప్పి విద్యార్థులు నిత్యం అల్లర్లతో సమయం వృథా చేయకుండా, బాధ్యతగా చదువుకోవాలని ఆయన సూచించడం గమనార్హం. యుక్త వయస్సులో తప్పులు చేయడం సహజమని, కానీ చదువు పూర్తయ్యేలోగా బాధ్యతతో చదివి ఉత్తమ ఉద్యోగాలుగా మారాలని ఆయన సూచించారు. తాను చేసిన తప్పులు చేయొద్దని విద్యార్థులకు ఆయన నేరుగా చెప్పలేదు. కానీ, సమయం మాత్రం వృధా చేయొద్దని మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు.

Karnataka: తాము ఎలాంటి వారిమైనప్పటికీ.. చిన్న పిల్లలు, విద్యార్థుల ముందుకు వెళ్లినప్పుడు నాలుగు మంచి మాటలు చెప్పాలని అనుకుంటాం. మన అనుభవాలు ఏమైనా సరే, అందులో నుంచి గొప్పవి ఉన్నతమైనవి మాత్రమే చెప్తుంటాం. ఒక్కోసారి లేని అనుభవాలు, చేయని పనులను కూడా మీదేసుకుని గొప్పలకు పోతుంటాం. కానీ కర్ణాటకకు చెందిన మంత్రి అలా కాదు. తన స్కూలు సమయంలో తాను ఎలా ఉండేవాడో అదే నిజాన్ని విద్యార్థులకు చెప్పాడు. తాను చేసిన రౌడీయిజం, కాపీ కొట్టి పాసవ్వడం వంటి విషయాల్ని నేరుగానే వెల్లడించారు. బళ్లారిలో వీరశైవ విద్యసంస్థ ఎస్‌జీ కాలేజి అమృతమహోత్సవం, దాతల దినాచరణను శనివారం నిర్వహించారు. దీనికి కర్ణాటక మంత్రి శ్రీరాములు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

World Bank Report: ఇండియాలో పురుషుల కంటే మహిళలే ఎక్కువ పని చేస్తున్నారు

‘‘నేను చదువుకున్న రోజుల్లో తరచూ గొడవ చేసేవాన్ని. అయితే ఉపాధ్యాయులు మాత్రం గౌరవంగా, అభిమానంగా చూసేవారు. నేను గూండాగిరి చేసి జైలుకు కూడా వెళ్లాను. గొడవలు పడి 14, 15 సార్లు జైలుకు కూడా వెళ్లాను. అయితే సంస్కారం మాత్రం వదలలేదు. ఉపాధ్యాయులు నన్ను చాలా ఆప్యాయంగా పలకరించే వారు. ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాను. నాలుగు సార్లు మంత్రి అయ్యాను. చిన్నతనంలో ప్రతి ఒక్కరు తప్పులు చేస్తారు. దానిని సరిదిద్దుకోవడం మానవ సహజం. నేను పేద ప్రజల కోసం ప్రాణమిచ్చేవాడినని’’ అని పేర్కొన్నారు.

Gujarat AAP: ఎమ్మెల్యేలుగా గెలిచి రెండ్రోజులు కాలేదు, అప్పుడే బీజేపీలోకి జంపింగ్‭లు.. మొదటిసారి ఫిరాయింపుల్ని ఎదుర్కొంటున్న ఆప్!

ఇంతా చెప్పి విద్యార్థులు నిత్యం అల్లర్లతో సమయం వృథా చేయకుండా, బాధ్యతగా చదువుకోవాలని ఆయన సూచించడం గమనార్హం. యుక్త వయస్సులో తప్పులు చేయడం సహజమని, కానీ చదువు పూర్తయ్యేలోగా బాధ్యతతో చదివి ఉత్తమ ఉద్యోగాలుగా మారాలని ఆయన సూచించారు. తాను చేసిన తప్పులు చేయొద్దని విద్యార్థులకు ఆయన నేరుగా చెప్పలేదు. కానీ, సమయం మాత్రం వృధా చేయొద్దని మంత్రి శ్రీరాములు పేర్కొన్నారు.

ట్రెండింగ్ వార్తలు