Hemant Soren To Appoint Wife Kalpana Soren As Jharkhand Chief Minister
Kalpana Soren: జార్ఖండ్ నూతన ముఖ్యమంత్రిగా కల్పనా సొరేన్ బాధ్యతలు చేపట్టనున్నారనే సంకేతాలు వెలువడుతున్నాయి. సీఎం హేమంత్ సొరేన్ తన స్థానంలో భార్యకు పగ్గాలు అప్పజెప్పనున్నారని వార్తలు వస్తున్నాయి. భూ కుంభకోణం, మనీ లాండరింగ్ కేసులో హేమంత్ సొరేన్ కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు తీవ్రంగా గాలిస్తున్నారు. దీంతో ఆయన అదృశ్యమయినట్టు వార్తలు వచ్చాయి. అయితే ఆయన రాంచీలోనే ఉన్నట్టు వెల్లడైంది.
ఈ పరిణామాల నేపథ్యంలో హేమంత్ సొరేన్ సొరేన్ అధ్యక్షతన రాంచీలో జేఎంఎం నాయకులు భేటీ అయ్యారు. హేమంత్ సొరేన్ భార్య కల్పన కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఒకవేళ హేమంత్ సొరేన్ అరెస్టై జైలుకెళితే ఆయన భార్యకు ముఖ్యమంత్రి బాధ్యతలు అప్పగించే విషయంపై సమావేశంలో చర్చిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఎమ్మెల్యేలు అందరూ రాజధానిలోనే ఉండాలని తమ పార్టీతో పాటు కూటమి భాగస్వాములైన కాంగ్రెస్, ఆర్జేడీలను అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) కోరడం ఈ వార్తలకు బలానిస్తున్నాయి.
కల్పనా సోరెన్ ను ముఖ్యమంత్రి పీఠంపై కూర్చొబెట్టానికి JMM పావులు కదుపులోందని, అందుకే అధికార కూటమిలోని ఎమ్మేల్యేలను రాంచీలో ఉండాలని కోరిందని బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే అన్నారు. 81 మంది సభ్యుల జార్ఖండ్ అసెంబ్లీలో జేఎంఎం 31, కాంగ్రెస్ 16 మంది సభ్యులను కలిగివున్నాయి. ఆర్జేడీకి ఒక ఎమ్మెల్యే ఉన్నారు. విపక్ష బీజేపీకి 25, జార్ఖండ్ వికాస్ మోర్చా 3, ఆల్ జార్ఖండ్ స్టూడెంట్స్ యూనియన్ 2, ఇతరులు నలుగురు ఉన్నారు.
Also Read: రాజ్యసభ ఎన్నికలు.. 15 రాష్ట్రాల్లో 56 మంది కొత్త సభ్యుల ఎన్నిక