ఇలా కూడా ఉంటారా: 55వ బర్త్ డేకు న్యూడ్‌గా పరిగెత్తిన మిలింద్ సోమన్
- Subhan Ali Shaik
- Published On : November 4, 2020 / 12:55 PM IST
బర్త్ డేకు ఇష్టమైన పని చేయడం అంటే.. ఏ తినడమో, తాగడమో చేస్తుంటారు. మహా అయితే ఏదో నచ్చిన హాబీ ఫాలో అవుతారు. మోడల్-యాక్టర్ మిలింద్ సోమన్ కూడా అలాగే చేశాడు కానీ, చూడ్డానికి మనకే విచిత్రంగా అనిపించొచ్చు.
55వ బర్త్ డే సందర్భంగా తనకు చాలా ఇష్టమైన రన్నింగ్‌ను అది కూడా బీచ్ సైడ్ న్యూడ్ గా కనిపించాడు. పైగా దీనిని పోస్టు చేస్తూ.. తనకు తానే విషెస్ చెప్పుకున్నాడు. హ్యాపీ బర్త్ డే టూ మీ. 55 అండ్ రన్నింగ్ అంటూ పోస్టు పెట్టాడు.
అతని భార్య అంకితా కొన్వార్ యే ఈ ఫొటో తీసిందట. మిలింద్ సోమన్ న్యూడ్ గా ఫొటో దిగడం ఇది ఫస్ట్ టైం కాదు. 90ల్లో టఫ్ షూస్ అనే కమర్షియల్ యాడ్ కోసం మాజీ మిస్ ఇండియా మధు సప్రేతో కలిసి న్యూడ్‌గా ఫొటో షూట్ లో పాల్గొని రచ్చలేపాడు. అప్పటల్లో వారిద్దరితో పాటు ఫొటోగ్రాఫర్, పబ్లిషర్ పైన కూడా 14ఏళ్ల పాటు కేసు నమోదైంది.
ప్రొఫెషనల్‌గా చూస్తే.. మిలింద్ చివరి సారిగా.. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్ సిరీస్ అయిన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్‌లో డా.అమీర్ వర్సీగా కనిపించాడు.
Happy birthday to me ?
.
.
.
55 and running ! ? @5Earthy pic.twitter.com/TGoLFQxmui— Milind Usha Soman (@milindrunning) November 4, 2020
