OPS: హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం.. పాత పెన్షన్ విధానికి కేబినెట్ ఆమోదం
పాత పెన్షన్ విధానాన్ని ఈరోజు నుంచే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేస్తున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి సుఖు ప్రకటించారు. అయితే పాత పెన్షన్ విధానాన్ని తాము ఓట్ల కోసం తీసుకురావడం లేదని, ఇది హిమాచల్ ప్రదేశ్ ప్రజల హక్కని అన్నారు
- tony bekkal
- Published On : January 13, 2023 / 07:06 PM IST
Himachal Pradesh Government Restores Old Pension Scheme
OPS: మొదటి క్యాబినెట్ సమావేశంలోనే హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖ్వీందర్ సింగ్ సుఖు చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో పాత పెన్షన్ విధానానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం జాతీయ పెన్షన్ విధానం కింద 1.36 లక్షల మంది ఉద్యోగులు, పెన్షన్ తీసుకునే వారు ఉన్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. చెప్పినట్లుగానే ప్రభుత్వం ఏర్పడ్డ కొద్ది రోజులకే దీన్ని అమలు చేసి చూపించింది.
Sharad Yadav: శరద్ యాదవ్ చొరవ చూపకపోతే లాలూ ప్రసాద్ యాదవ్ ముఖ్యమంత్రిని అయ్యేవారే కాదు
పాత పెన్షన్ విధానాన్ని ఈరోజు నుంచే అమలు చేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ తక్షణమే విడుదల చేస్తున్నట్లు కేబినెట్ సమావేశం అనంతరం జరిగిన మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి సుఖు ప్రకటించారు. అయితే పాత పెన్షన్ విధానాన్ని తాము ఓట్ల కోసం తీసుకురావడం లేదని, ఇది హిమాచల్ ప్రదేశ్ ప్రజల హక్కని అన్నారు. దీనితో పాటు రాష్ట్రంలో లక్ష ఉద్యోగాలు భర్తీ చేస్తామన్న అంశంపై కూడా ఆయన స్పందించారు. దీనిపై కమిటీ వేస్తున్నామని, ఆ హామీని కూడా నిలబెట్టుకుంటామని అన్నారు.
Karnataka: మద్యం కొనుగోలు వయసును మూడేళ్లు తగ్గించనున్న ప్రభుత్వం.. 18 ఏళ్ల ఉంటే చాలట
