×
Ad

Sabarimala : ఇరుముడి కట్టుకొని, అయ్యప్పను దర్శించుకున్న గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్

కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ శబరిమల అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు.

  • Published On : April 12, 2021 / 02:08 PM IST

Ayyappa

Governor Arif Mohammed Khan : కేరళ గవర్నర్ అరిఫ్ మహ్మద్ ఖాన్ శబరిమల అయ్యప్ప స్వామి మెట్లు ఎక్కారు. అక్కడ స్వామి వారిని దర్శించుకున్నారు. ఆయన ఆలయానికి వెళ్లిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. 2021, ఏప్రిల్ 11వ తేదీ ఆదివారం ఆయన శబరిమల ఎక్కి అయ్యప్ప స్వామి వారిని దర్శించుకున్నారు. మెడలో మాలను ధరించి..ఇరుమడి ధరించిన ఆయన సుమారు ఐదు కిలోమీటర్ల మేర నడిచి..సాధారణ అయ్యప్ప భక్తుడి వలే…రావడం విశేషం.

మాస పూజలు ఇతర కార్యక్రమాల సందర్భంగా…శబరిమల ఆలయాన్ని రెండు రోజుల కిందట తెరిచారు. ఈ నేపథ్యంలో కేరళ గవర్నర్ ఆలయాన్ని దర్శించుకుని పూజలు నిర్వహించారు. 18 మెట్ల గుండా..సన్నిధానానికి చేరుకున్న ఆయనకు ఆలయం వద్ద ట్రావెన్ కోర్టు దేవస్థానం బోర్డు అధ్యక్షులు, ఇతర సభ్యులు ఘన స్వాగతం పలికారు.

కొవిడ్ కేసులు పెరిగిపోతున్న నేప‌థ్యంలో ఆంక్ష‌లు కొన‌సాగుతాయ‌ని ట్రావెన్‌కోర్ దేవ‌స్థానం స్ప‌ష్టం చేసింది. 48 గంట‌ల ముందే ఆర్టీ-పీసీఆర్ టెస్ట్ నెగ‌టివ్ రిపోర్ట్ క‌లిగిన వాళ్లు, లేదంటే వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారికే మాత్రమే ద‌ర్శ‌నానికి అనుమ‌తి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. విశు పండ‌గ సంద‌ర్భంగా ఆల‌యాన్ని తెరిచారు. ఈనెల 18 వ‌ర‌కూ తెరిచే ఉంటుంది.