భారత్‌లో ఓ గ్రామానికి అమెరికా అధ్యక్షుడి పేరు..ఎక్కడుందో తెలుసా?

  • Publish Date - February 25, 2020 / 10:55 AM IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తొలిసారి భారత్ లో పర్యటిస్తున్నారు. ఈ సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలో ఉన్న ఒక గ్రామం వార్తల్లోకి వచ్చింది. అది హర్యానాలోని గురుగ్రామ్ (గుర్గావ్) లో ఉంది. ఆ గ్రామం పేరు ‘ కార్టర్‌పురి’. ట్రంప్ భారత్ పర్యటనకు  కార్టర్‌పురికి సంబంధం ఏంటి అనే అనుమానం వస్తుంది కదూ.  మాజీ అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ పేరు పెపే ఈ కార్టర్‌పురి.

కార్టర్‌పురికి జిమ్మీ కార్టర్ పేరు ఎలా వచ్చింది?
జనతా పార్టీ అధికారంలో ఉన్న సమయంలో అంటే 1978 జనవరి 3న  అమెరికా మాజీ అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ తన భార్య రోసాలిన్ కార్టర్ తో ఢిల్లీకి దగ్గరలో ఉన్న ‘దౌలత్​పూర్ నసీరాబాద్’ అనే పల్లెటూరుకి జిమ్మీ కార్డర్ వెళ్లారు. ఈ ఊరితో జిమ్మీ కార్టర్​కు అనుబంధం ఉంది. 

60ల్లో కార్టర్ తల్లి  లిలియన్ గోర్డి కార్టర్ 1960  ‘ఆర్మీ కోర్​’ మెంబర్​గా అంటే ఒక సామాజిక కార్యకర్తగా ఈ ఊరికి వచ్చారట. అప్పుడు  ఈ గ్రామానికి ఒక టెలివిజన్ సెట్​ను కార్టర్ దంపతులు కానుకగా ఇచ్చారు. ఊరి అభివృద్దికి పెద్ద ఎత్తున నిధులు ఇస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ తరువాత జిమ్మీ కార్డర్ సందర్శనకు గుర్తుగా ఊరి పేరు మార్చేశారు. ‘దౌలత్​పూర్ నసీరాబాద్​’ కాస్తా ‘కార్టర్ పురి’ అయిపోయింది.

ఆ తరువాత కూడా జిమ్మీ కార్టర్.. అమెరికా వెళ్లిపోయాక కార్టర్ పురిలో ఉండే స్కూల్ హెడ్ మాస్టర్ కు లేఖ రాస్తూ..‘‘నేను మీ గ్రామాన్ని సందర్శించినప్పుడు మీ గ్రామ ప్రజలంతా నాకు అందించిన ఆత్మీయ ఆతిథ్యం మరచిపోలేనిదనీ..మీరు చూపించిన ప్రేమాభిమానాలు..స్నేహం ఆత్మీతయ మరచిపోలేదని ఇంతటి మంచి మనస్సులు కలిగిన మిమ్మల్ని కలుసుకోవటం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చిందని మీ స్నేహాన్ని అభినందిస్తున్నాను..నా మొత్తం విదేశీ ప్రయాణంలో మీ గ్రామాన్ని సందర్శించిన సందర్బం మరచిపోలేది’’అంటూ జమ్మీ కార్టర్, అమెరికా ప్రథమ మహిళ రోసాలిన్ కార్టర్ లేఖలో పేర్కొన్నారు. 

అమెరికా ప్రథమ మహిళ అయిన జిమ్మీకార్టర్ భార్య రోసాలిన్ కూడా గ్రామ ప్రజలకు లేఖ రాస్తూ..‘‘మా భారత్ పర్యటనలో జిమ్మీతో పాటు నేను కూడా మీ మనోహరమైన ఆతిథ్యాన్ని ఆస్వాదించారు.అది మాకు ఎంతో గొప్ప బహుమతిగా భావిస్తున్నాం..ఇటువంటి ఆదరాభిమానాలు మాకు లభించినందుకు చాలా సంతోషంగా ఉంది..మీ ఆదరాభిమానాలకు మీ ఆతిధ్యానికి ధన్యవాదాలు’’అని రాశారు. 

1978 జనవరి 3న  అమెరికా మాజీ అమెరికా మాజీ అధ్యక్షుడు జిమ్మీ కార్టర్ మన దేశానికి వచ్చేటప్పుటికీ భారత ప్రధానిగా మొరార్జీ దేశాయ్ ఉన్నారు. టూర్​లో భాగంగా మూడు రోజుల పాటు జిమ్మీ కార్టర్ భారత్ లోనే ఉన్నారు. 1971లో బంగ్లాదేశ్​ విముక్తి సమయంలో జరిగిన ఇండో–పాక్​ యుద్ధం తరువాత అమెరికా, ఇండియా మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో జిమ్మీ కార్టర్ టూర్​ రెండు దేశాల మధ్య మళ్లీ మామూలు పరిస్థితులు నెలకొనేలా చేయడానికి ఉపయోగపడిందని చెప్పవచ్చు. టూర్ సందర్భంగా పార్లమెంటులో కార్టర్ ప్రసంగించారు.