Toll Tax On Two Wheelers: టూ వీలర్స్‌పై టోల్ ట్యాక్స్? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు..

జూలై 15 నుండి ద్విచక్ర వాహనాలకు టోల్ పన్ను వసూలు చేయబడుతుందని సూచించే వాదనపై గత నెల జూలైలో.. (Toll Tax On Two Wheelers)

Toll Tax On Two Wheelers: టూ వీలర్స్‌పై టోల్ ట్యాక్స్? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి.. తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన విషయాలు..

Updated On : August 23, 2025 / 8:39 PM IST

Toll Tax On Two Wheelers: దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలలోని టోల్ ప్లాజాల వద్ద టూ వీలర్స్ పై ఎటువంటి వినియోగదారు రుసుము విధించబడదని జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) స్పష్టం చేసింది. ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించారని కొన్ని మీడియా నివేదికలు వెలువడటంతో ఒక్కసారిగా కలకలం రేగింది.

దీనిపై జాతీయ రహదారుల అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) స్పష్టత ఇచ్చింది.

టోల్ ప్లాజాల వద్ద ద్విచక్ర వాహనాల నుండి టోల్ వసూలుకు సంబంధించి సోషల్ మీడియాలో వ్యాపించే నకిలీ వార్తలపై రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ (NHAI) గురువారం (ఆగస్టు 21) ఒక ప్రకటనలో వివరణ ఇచ్చింది.

జాతీయ రహదారులపై జాతీయ రహదారి రుసుము (రేట్లు, వసూలు నిర్ణయం) నియమాలు, 2008 ప్రకారం యూజర్ ఫీ వసూలు చేయబడుతుందని NHAI తెలిపింది.

అయితే, టూ వీలర్స్ నుండి టోల్ రుసుము వసూలు చేసే ప్రతిపాదన ఏదీ లేదని క్లారిటీ ఇచ్చింది.

దీనిపై కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ సైతం స్పందించారు. ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించే నివేదికలను ఆయన తోసిపుచ్చారు.

”అలాంటి నిర్ణయం ప్రతిపాదించబడలేదు. టూ వీలర్స్ కు టోల్‌పై పూర్తి మినహాయింపు కొనసాగుతుంది. ద్విచక్ర వాహనాలపై టోల్ పన్ను విధించడం గురించి తప్పుదారి పట్టించే వార్తల వ్యాప్తిని ఖండిస్తున్నాం.

నిజం తెలియకుండా తప్పుదారి పట్టించే వార్తలను వ్యాప్తి చేయడం ద్వారా సంచలనం సృష్టించడం ఆరోగ్యకరమైన జర్నలిజానికి సంకేతం కాదు” అని నితిన్ గడ్కరీ అన్నారు.

టూ వీలర్స్ టోల్ పన్నుకు లోబడి ఉన్నాయి అంటూ యూట్యూబ్, ఎక్స్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో విస్తృతంగా వీడియోలు షేర్ చేయబడ్డాయి.

జాతీయ రహదారులపై బైక్‌లకు టోల్‌ విధిస్తున్నారని పేర్కొంటూ టోల్ ప్లాజాల వద్ద టూ వీలర్స్ బారులు తీరినట్లుగా ఉన్న వీడియోలను వైరల్ చేశారు.

అయితే, దేశవ్యాప్తంగా ఉన్న జాతీయ రహదారులు, జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలలోని టోల్ ప్లాజాల వద్ద ద్విచక్ర వాహనాల నుండి ఎటువంటి వినియోగదారు రుసుము వసూలు చేయబడదని NHAI స్పష్టం చేసింది.

దీనికి తోడు, BCFDI చేసిన ఫ్యాక్ట్ చెక్ ప్రకారం, ద్విచక్ర వాహనాలకు టోల్ పన్ను వసూలు చేయబడుతుందనే వాదన కూడా నకిలీదని తేలింది.

టూ వీలర్లపై టోల్ ట్యాక్స్..? ఫ్యాక్ట్ చెక్..

జూలై 15 నుండి ద్విచక్ర వాహనాలకు టోల్ పన్ను వసూలు చేయబడుతుందని సూచించే వాదనపై గత నెల జూలైలో ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో (PIB) ఫ్యాక్ట్ చెక్ నిర్వహించింది. అది నకిలీదని తేల్చింది.

“జూలై 15 నుండి ద్విచక్ర వాహనాలకు టోల్ ఛార్జీలు? ఇదిగో నిజం!” అని ఎక్స్ లో PIB పేర్కొంది. “జూలై 15, 2025 నుండి ద్విచక్ర వాహనాలు హైవేలపై టోల్ చెల్లించాల్సి ఉంటుందని అనేక సోషల్ మీడియా పోస్ట్ లు పేర్కొంటున్నాయి.

ఈ వాదన నకిలీది. NHAI అలాంటి ప్రకటన చేయలేదు. టూ వీలర్స్ పై టోల్ విధించే ప్రణాళికలు లేవు” అని PIB X లో తెలిపింది.

నేషనల్ హైవే ఫీ (రేట్లు, వసూలు నిర్ణయం) నియమాలు, 2008.. టూ వీలర్స్ గురించి ఏం చెబుతుందో తెలుసుకుందాం..

* నేషనల్ హైవే ఫీల్ రూల్స్ 2008 ప్రకారం, టూ వీలర్స్, త్రీ వీలర్స్ (ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు), జంతువులు లాగుతున్న వాహనాలు జాతీయ రహదారి, శాశ్వత వంతెన, బైపాస్ లేదా సొరంగం విభాగాన్ని ఉపయోగించినందుకు ఎటువంటి రుసుము విధించబడదు.
*”జాతీయ రహదారి, శాశ్వత వంతెన, బైపాస్ లేదా సొరంగం విభాగాన్ని ఉపయోగించేందుకు త్రీ-వీలర్లు, (ట్రాక్టర్లు, కంబైన్ హార్వెస్టర్లు), జంతువులు లాగుతున్న వాహనాలను అనుమతించకూడదు. సందర్భాన్ని బట్టి శాశ్వత వంతెన, బైపాస్ లేదా సొరంగం స్థానంలో సర్వీస్ రోడ్డు లేదా ప్రత్యామ్నాయ రహదారి అందుబాటులో ఉంది.”
* “సర్వీస్ రోడ్డు లేదా ప్రత్యామ్నాయ రోడ్డు అందుబాటులో ఉండి, యజమాని, డ్రైవర్ లేదా ద్విచక్ర వాహనం బాధ్యత వహించే వ్యక్తి జాతీయ రహదారి, శాశ్వత వంతెన, బైపాస్ లేదా సొరంగం విభాగాన్ని ఉపయోగిస్తున్నట్లయితే, కారుపై విధించే రుసుములో యాభై శాతం వసూలు చేయబడుతుంది”.
* ‘ప్రత్యామ్నాయ రహదారి’ అంటే క్యారేజ్‌వే 10 మీటర్ల కంటే ఎక్కువ వెడల్పు కలిగి ఉండి, ఆ జాతీయ రహదారి పొడవు కంటే 20 శాతం మించని ఇతర రహదారి.
* ‘సర్వీస్ రోడ్డు’ అంటే జాతీయ రహదారిలోని ఒక విభాగానికి సమాంతరంగా వెళ్లే రహదారి. ఇది జాతీయ రహదారి రుసుము నియమాలు, 2008 ప్రకారం ఆ జాతీయ రహదారి ఆ విభాగానికి ఆనుకుని ఉన్న భూమికి యాక్సిస్ అందిస్తుంది.

Also Read: పాత కారు, బైక్ కొంటున్నారా జాగ్రత్త.. ఈ ఎఫెక్ట్‌తో తుక్కుకి వేయడమే..!