IADWS: శత్రు దేశాల గుండె గుభేల్.. మూడు టార్గెట్లు.. ఒకే ఒక్క షాట్‌.. భారత కొత్త రక్షణ వ్యవస్థ పరీక్ష సక్సెస్‌.. ఇకపై..

ఇటువంటి సాంకేతికత ప్రపంచంలో అతి కొద్ది దేశాల వద్దే ఉంది.

IADWS: శత్రు దేశాల గుండె గుభేల్.. మూడు టార్గెట్లు.. ఒకే ఒక్క షాట్‌.. భారత కొత్త రక్షణ వ్యవస్థ పరీక్ష సక్సెస్‌.. ఇకపై..

IADWS

Updated On : August 24, 2025 / 6:24 PM IST

గగనతల రక్షణ వ్యవస్థలో భారత్‌ మరో భారీ ముందడుగు వేసింది. ఒడిశా తీరంలో గత అర్ధరాత్రి సమగ్ర గగనతల రక్షణ ఆయుధ వ్యవస్థ (ఐఏడీడబ్ల్యూఎస్)ను విజయవంతంగా పరీక్షించింది. దీని ద్వారా భారత్ మరో మైలురాయిని చేరుకోవడమే కాకుండా స్వదేశీ సాంకేతికతలో తన రక్షణ సామర్థ్యాన్ని మరింత పెంచుకుంటుదన్న సంకేతం ఇచ్చింది.

ఐఏడీడబ్ల్యూఎస్ ప్రత్యేకత ఏంటి?

ఐఏడీడబ్ల్యూఎస్‌ని భారత గగనతల రక్షణ గొడుగుగా భావించవచ్చు. ఇది మూడు రకాల రక్షణ సాంకేతికతలను ఒకే కమాండ్ కేంద్రంలో కలుపుతుంది. ఇందులోని క్విక్ రియాక్షన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ (క్యూఆర్ఎస్ఏఎం) వేగంగా వచ్చే ప్రమాదాలను ఎదుర్కొంటుంది.

Also Read: సురవరం సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించిన బంధువులు

అడ్వాన్స్‌డ్ వెరీ షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ (VSHORADS) దగ్గర పరిధి లక్ష్యాలను ఎదుర్కొంటుంది. అత్యంత ఆధునిక, అధిక శక్తితో కూడిన లేజర్ ఆయుధం రక్షణను అందిస్తుంది. ఈ తాజా పరీక్షలో ఈ సమగ్ర వ్యవస్థ రెండు అధిక వేగ మానవరహిత విమానాలు, ఒక మల్టీ కాప్టర్ డ్రోన్‌ను ఒకేసారి ధ్వంసం చేసి తన సామర్థ్యాన్ని నిరూపించింది. ఈ విధమైన బహుళ లక్ష్యాలను ఎదుర్కొనే సామర్థ్యం ఆధునికతర యుద్ధానికి అవసరం.

ఇది భారత్‌కు ఎందుకు ఇంత ముఖ్యం?
ఆధునిక యుగంలో శత్రుదేశాలు కేవలం యుద్ధ విమానాలు, క్షిపణులనే కాకుండా డ్రోన్లు, మానవరహిత వాహనాలను బాగా వాడుతున్నాయి. ఇటీవల జరిగిన యుద్ధాల్లో డ్రోన్ దాడులు విధ్వంసాన్ని సృష్టించాయి. భారత ఐఏడీడబ్ల్యూఎస్ ఇటువంటి అన్ని రకాల దాడులకు ఒకేసారి ఎదుర్కొనే నెట్వర్క్‌ను అందిస్తోంది.

డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కేంద్రీకృత కమాండ్ కంట్రోల్ వ్యవస్థ వేర్వేరు ఆయుధాలు సమన్వయంగా పనిచేసేలా చేస్తుంది. ఇవి ఒంటరిగా కాకుండా పరస్పర సమాచారం పంచుకొని ప్రతిస్పందిస్తాయి.

ఇందులోని అన్ని భాగాలు భారత్‌లోనే తయారయ్యాయి. క్షిపణుల నుంచి లేజర్ ఆయుధాలు కమాండ్ వ్యవస్థల వరకు అన్నింటినీ స్వదేశంలోనే అభివృద్ధి చేశారు. ఇది ఆత్మనిర్భర్ భారత్ ఆత్మను ప్రతిబింబిస్తోంది. దశాబ్దాలుగా భారత్ అధునాతన రక్షణ వ్యవస్థల కోసం విదేశాలపై ఆధారపడింది. దీని వల్ల అధిక ఖర్చులు, సంక్షోభ సమయంలో సరఫరా ఆగిపోవడం వంటివి జరిగేది. ఇప్పుడు స్వదేశీ సామర్థ్యాలు అభివృద్ధి చేయడంతో ఖర్చు తగ్గింది.

వ్యూహాత్మక ప్రాముఖ్యత

ఐఏడీడబ్ల్యూఎస్ కీలక సందేశాన్ని ఇస్తోంది. భారత్ పెంచుకుంటున్న సాంకేతిక రక్షణ సామర్థ్యాన్ని ప్రపంచానికి చూపిస్తోంది. బహుళస్థాయి రక్షణ వ్యవస్థలు ఎంతో అవసరం. సైన్యానికి ఇది ఆపరేషనల్ సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇటువంటి సాంకేతికత ప్రపంచంలో అతి కొద్ది దేశాల వద్దే ఉంది.