CNG Price Hike : సీఎన్‌జీ ధర పెంపు.. వాహనదారులపై మరో భారం.. కొత్త రేట్లు ఇవే! నేటి నుంచే అమల్లోకి..

CNG Price Hike : అంతర్జాతీయంగా ఎల్ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ధరలు భారీగా పెరగడం, ఇన్‌పుట్ గ్యాస్ ఖర్చులు పెరగడం వల్లే సీఎన్‌జీ ధరలను సవరించాల్సి వచ్చిందని ఐజీఎల్ తెలిపింది.

CNG price hike

CNG Price Hike : వాహనదారులకు మరోసారి షాక్ తగిలింది. ఇప్పటికే పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతున్న వాహనదారులపై సీఎన్‌జీ ధరల పెంపు అదనపు భారం మోపనుంది. ఇంధ్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ (ఐజీఎల్) కీలక నిర్ణయం తీసుకుంది. కిలో సీఎన్‌జీపై ఏకంగా రూ.3.89 పెరిగింది. పెంచిన ధరలు నేటి నుంచి అమల్లోకి వచ్చాయి. దీంతో ఢిల్లీ -ఎన్సీఆర్ ప్రాంతంలో సీఎన్‌జీ ధర కిలోకు రూ.86.98కు చేరింది.

Also Read : Yamaha R2 Launch : యమహా నుంచి ఫస్ట్ 204cc సూపర్‌స్పోర్ట్ బైక్.. ఫీచర్లు చూస్తే ఫిదానే.. ధర తెలిస్తే నోరెళ్లబెడతారు!

అంతర్జాతీయంగా ఎల్ఎన్‌జీ (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్) ధరలు భారీగా పెరగడం, ఇన్‌పుట్ గ్యాస్ ఖర్చులు పెరగడం వల్లే సీఎన్‌జీ ధరలను సవరించాల్సి వచ్చిందని ఐజీఎల్ తెలిపింది. ముఖ్యంగా పశ్చిమాసియా సంక్షోభం, హోర్ముజ్ జలసంధి మీదుగా సరకు రవాణాపై ప్రభావం వంటి కారణాలతో అంతర్జాతీయ గ్యాస్ ధరలు పెరిగాయని పేర్కొంది.

అంతర్జాతీయ ఎల్ఎన్‌జీ ధరలు సంక్షోభానికి గతంలో పోలిస్తే దాదాపు రెట్టింపు అయ్యాయని ఐజీఎల్ తెలిపింది. మరోవైపు యూరప్ లో శీతాకాలానికి ముందు సహజవాయువు నిల్వలను పెంచుకోవాల్సిన అవసరం కూడా అంతర్జాతీయ ధరలపై ఒత్తిడిని పెంచుతోందని వెల్లడించింది.

ఆటోలు, క్యాబ్‌లు, బస్సులు, సీఎన్‌జీ కార్లు వినియోగించే వారిపై ప్రస్తుతం పెంపు భారం పడనుంది. సీఎన్‌జీ ధర పెరగడంతో ముఖ్యంగా ఆటో డ్రైవర్లు, క్యాబ్ సర్వీస్ నిర్వాహకులు, రోజువారీ ప్రయాణాలకు సీఎన్ జీ వాహనాలను ఉపయోగించే వారికి ఖర్చు పెరగనుంది. ఇంధన ధరల పెంపు రవాణా ఖర్చులపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది.

అయితే, ధరలు పెంపు, ఇతర ఇబ్బందులు నేపథ్యంలోనూ సీఎన్‌జీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేకుండా.. నిరంతరంగా సరఫరా కొనసాగుతుందని ఐజీఎల్ స్పష్టం చేసింది.