LPG Cylinder : గ్యాస్ వినియోగదారులకు శుభవార్త.. 4గంటల్లోనే ఇంటికి సిలిండర్ డెలివరీ.. సేవలు ప్రారంభం..
Indane 10 Kg Composite LPG Cylinder : ఎల్పీజీ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil) శుభవార్త చెప్పింది.
- Harish Thanniru
- Published on- July 26, 2026 / 12:18 PM IST
indane 10kg composite lpg cylinder
Indane 10 Kg Composite LPG Cylinder : ఎల్పీజీ వినియోగదారులకు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (Indian Oil) శుభవార్త చెప్పింది. ‘ఇండేన్ ఎక్స్‌ట్రా లైట్ నౌ’ (Indane Xtra Light Now) పేరుతో కొత్త 10 కేజీల కాంపోజిట్ ఎల్పీజీ సిలిండర్‌ను, అలాగే నాలుగు గంటల్లో ఎక్స్‌ప్రెస్ డెలివరీ సేవలను ప్రారంభించింది. ఇదే సేవలో భాగంగా 5 కేజీల ‘ఛోటూ’ ఎల్పీజీ సిలిండర్ కూడా బుక్ చేసిన నాలుగు గంటల్లోనే వినియోగదారులకు అందజేయనున్నారు.
Also Read : YS Sharmila Health : ఆస్పత్రి బెడ్‌పై వైఎస్ షర్మిల.. ఏమైంది..? ఫొటో వైరల్
ఈ సందర్భంగా ఇండియన్ ఆయిల్ చైర్మన్ ఎ.ఎస్. సాహ్నీ మాట్లాడుతూ.. కొత్త కాంపోజిట్ సిలిండర్ సాధారణ సిలిండర్లతో పోలిస్తే తేలికగా ఉండటంతో పాటు తుప్పు పట్టని ప్రత్యేక సాంకేతికతతో రూపొందించామని తెలిపారు. అంతేకాకుండా సిలిండర్‌లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో బయట నుంచే సులభంగా తెలుసుకునే సౌకర్యం కూడా ఇందులో ఉందని చెప్పారు. ఉద్యోగులు, చిన్న కుటుంబాల అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ 10 కేజీల సిలిండర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఆయన పేర్కొన్నారు.
తొలిదశలో పుణే, గుర్గావ్, ఇండోర్, కోయంబత్తూర్ నగరాల్లో ఈ సేవలను ప్రారంభించారు. ఆగస్టులో మరో 25 నగరాలకు విస్తరించనున్నట్లు, అక్టోబర్ నాటికి దేశవ్యాప్తంగా ఈ సేవలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు ఇండియన్ ఆయిల్ వెల్లడించింది. వినియోగదారులు IndianOil ONE యాప్, అధికారిక వెబ్‌సైట్ లేదంటే వాట్సాప్ ద్వారా కొత్త గ్యాస్ కనెక్షన్ పొందడంతో పాటు రీఫిల్ బుకింగ్ కూడా చేసుకోవచ్చని కంపెనీ తెలిపింది.
