India Corona Cases : దేశంలో కొత్తగా 7,231 కరోనా కేసులు, 45 మంది మృతి
దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 7,231 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,28,393కు చేరింది. వీటిలో 4,38,35,852 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారు.
- bheemraj
- Published On : August 31, 2022 / 05:32 PM IST
India Corona Cases
India Corona Cases : దేశంలో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. కొత్తగా 7,231 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 4,44,28,393కు చేరింది. వీటిలో 4,38,35,852 మంది వైరస్ నుంచి పూర్తిగా కోలుకుని, డిశ్చార్జ్ అయ్యారు.
ఇప్పటివరకు 5,27,874 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. మరో 64,667 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. మంగళవారం 5,439 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. గత 24 గంటల్లో వైరస్ సోకి 45 మంది మృతి చెందగా, 10,828 మంది కోలుకున్నారు.
Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
రోజువారీ పాజిటివిటీ రేటు 2.05 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.15 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని తెలిపింది. రికవరీ రేటు 98.67 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని వెల్లడించింది. ఇక దేశ వ్యాప్తంగా 212.39 కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను పంపిణీ చేశామని పేర్కొంది.
